న్యూ ఢిల్లీ : ఏపీ మంత్రుల వరుస ఢిల్లీ పర్యటనల వెనుక రహస్యమేంటని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. అందులో ఏం కుట్రలు దాగున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎయిడెడ్ సంస్థల విలీనం నిర్ణయం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్న కనకమేడల.. సమస్యలు పరిష్కరించలేక ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
‘‘మంత్రుల వరుస పర్యటనల ఆంతర్యమేంటి?ఈ భేటీ రాష్ట్ర ప్రజల కోసమా?వ్యక్తిగతమా?అప్పుల కోసం బుగ్గన దిల్లీలోనే తిష్ఠ వేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. వారు పెయిడ్ ఆర్టిస్టులు అయితే కంగారెందుకు?రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని కనకమేడల ఆరోపించారు.