చంద్రబాబు నాయుడి పర్యటనలో సంఘ విద్రోహ శక్తులు వీరంగం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
– టీడీపీ శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
చంద్రబాబు నాయుడి కడప జిల్లా పర్యటనలో పోలీసులు బాద్యతారాహిత్యంగా వ్యవహరించారు. జెడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న వ్యక్తి పర్యటనలో సంఘ విద్రోహ శక్తులు వీరంగం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిస్తే అర్దరాత్రి హౌస్ అరెస్టులు చేసే పోలీసులు వైసీపీ అల్లరి మూకల్ని ఎందుకు అడ్డుకోలేదు ? చంద్రబాబు నాయుడి పర్యటనలో వైసీపీ కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగురవేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కడప జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలి. చంద్రబాబు పర్యటనలో జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం.