– పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో సరైన ప్రత్యర్థి లేకనే ధూళిపాళ్ల గెలవగలిగారు.
నరేంద్ర నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ ఎప్పుడు చేయలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుని కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నారని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళి విమర్శించారు. ఆయన నియోజకవర్గంలో తిరగలేక నాపై కేసులు బనాయిస్తున్నారు. నేను పారిపోతాను అని భ్రమ పడుతున్నారు. ఎలా పుట్టాం… అన్నది కాదు ఎలా గిట్టాం అన్నదే ముఖ్యం. ధూళిపాళ్ల ప్రతిదాంట్లో డబ్బులు దండుకుంటున్నారు.
స్వయాన వారి పత్రిక ఈ విషయం తెలియజేసింది. పొన్నూరు శాసన సభ్యుడికి గుంటూరులో ఏం పని.
మంత్రి రాకపోయేసరికి కలెక్షన్ కింగ్ గా మారాడు. అఖిలపక్షం పిలిచి కొండవీటి వాగు, రాజధాని ముంపు చూపించవచ్చు కదా! పొన్నూరు నియోజకవర్గంలో ముంపునకు సంబంధించి ప్రభుత్వం స్వేత పత్రమైన విడుదల చేయొచ్చు కదా! టీడీపీలో ఈసారి టికెట్ కూడా ఇవ్వరు. బీజేపీ వైపు చూస్తున్నాడు. రైతులు పంట మునిగితే తన ప్రొడక్ట్ ప్రమోషన్, కృష్ణాష్టమికి కోలాటం ఆడుకుంటున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో 31 వేల ఎకరాలు మునిగితే లేఅవుట్లు వేసుకోమని రైతులకు స్థానిక ఎమ్మెల్యే సలహా ఇచ్చాడంట. ఎకరాకు పది వేల చొప్పున కమిషన్ అడిగారని పత్రికలో వచ్చిందని అంబటి మురళి అన్నారు.