– సోనియాగాంధీ అడ్డం పడలేదా?
– రేవంత్ రెడ్డి బుడ్డర ఖాన్
– రేవంత్ మూడు ఫీట్లు ఉంటే అందరూ మూడు ఫీట్లు ఉంటారా
– బీ ఆర్ ఎస్ నేత గట్టు రామచంద్రరావు, గౌతమ్ ప్రసాద్
హైదరాబాద్: నిన్న రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుంది.తల్లిని గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి అవమానించారు. రేవంత్ రెడ్డి మూడు ఫీట్లు ఉంటే అందరూ మూడు ఫీట్లు ఉంటారా
హరీష్ రావును,కేటిఆర్ ను రేవంత్ రెడ్డి బాడీ షేమింగ్ చేస్తున్నారు. అద్దంలో చూసుకోవాల్సింది కేటీఆర్ కాదు రాహుల్ గాంధీ. ఓడిపోగానే కేసీఆర్ మూలన పడ్డారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు.మరి సోనియాగాంధీ అడ్డం పడలేదా? చావు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుంది
రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికలు పెట్టాలి. రేవంత్ రెడ్డి బుడ్డర ఖాన్ లా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడాలో భాష నేర్చుకోవాలి.రేవంత్ రెడ్డి దుర్మార్గపు భాష మాట్లాడారు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బూతులు తిడతాము. రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అయినా మేము మాట్లాడగలము. రేవంత్ రెడ్డికి తొండలకు ఉన్న సంబంధం ఏమిటి?
రేవంత్ రెడ్డి భాష తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు. తెలంగాణ పౌరుషం గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు.మేము అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డిని తరిమికొట్టడం ఖాయం. రేవంత్ రెడ్డి ప్రతి మాటను తిరిగి చెల్లిస్తాము. రేవంత్ రెడ్డి గర్వాన్ని,అహంకారాన్ని పాతాళంలోకి తొక్కడం ఖాయం.