-ఉన్నది చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు?
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదాఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా?పిఆర్సి, సిపిఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందా లేదాఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి వేధించటం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా?ఆఖరికి టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారా లేదా?హరీష్ రావు ఉన్నది చెబితే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని ఖండిస్తున్నాం.