– కావాల్సింది సబ్బండ వర్ణాల పురోగతి
– ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా రైతు దుస్థితిపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా, ఏ ఫొటోగ్రాఫర్ కూడా తీయడానికి ఇష్టపడని కొన్ని విషాద చిత్రాలు. కానీ ఇవే నేటి తెలంగాణలో వాస్తవ చిత్రాలు. సాగునీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు.. రుణమాఫీ ఎప్పుడు అవుతుందో తెలియక ఎదురు చూసి అలసిపోయిన అన్నదాతలు.
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం. యూరియా కోసం రైతన్నలు కడుతున్న అంతులేని క్యూలు. ఓవైపు ఇందిరమ్మ ఇండ్ల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆడబిడ్డలు..మరోవైపు కండ్ల ముందే సొంతింటిని బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంటే తట్టుకోలేక గుండె పగిలేలా రోదిస్తున్న అభాగ్యుల ఆర్తనాదాలు.
హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడని నిలదీసిన యువతకు సమాధానంగా విరుచుకుపడుతున్న లాఠీల కాఠిన్యం. తెలంగాణకు కావాల్సింది ఈ హృదయవిదారక దృశ్యాలు కాదు. కావాల్సింది సబ్బండ వర్ణాల పురోగతి.