– వాళ్లే విచారించి తీర్పులిస్తారా?
– మహానాడు స్ధాయికి ఈనాడు దిగజారిందా?
– వీరి పాపాలకు అంతులేకుండా పోతుంది
– టీవీ 5 మూర్తిని ఎందుకు అరెస్టు చేయరు?
– ఎన్ని అరెస్టులు చేసినా మీ తప్పులని ఎత్తి చూపుతూనే ఉంటాం
– సతీష్ కుమార్ మృతిపై ఇష్టమొచ్చిన రీతిలో మీడియా ట్రైల్స్
– కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకముందు హత్య అంటూ వారికి వారే వరుస కధనాలతో తేల్చేశారు
– పోలీసులు మాట్లాడకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాలు
– టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో రెచ్చగొట్టే కథనాలు ‘మహానాడు’పై విషం చిమ్మిన వైఎస్ఆర్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)
తాడేపల్లి: మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ‘మహానాడు’ మీడియాపై విషం చిమ్మారు. మహానాడు మీడియా వార్తలు, బ్రేకింగు న్యూస్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న హత్యలు, దాడులు, అరెస్టులపై వైసీపీ వ్యవ హరిస్తున్న చింతామణి తీరును ఎండగడుతున్న మహానాడును, యాజమాన్యాన్ని వాడు, వీడు అంటూ దిగజారుడు భాష వాడారు. గురువిందగింజలా జర్నలిజం గురించి హితోక్తులుతో సుద్దులు పలికారు. వైయస్సార్సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి అరెస్టు రెడ్ బుక్ పైశాచికత్వానికి పరాకాష్ట మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పనిచేసిన సతీష్ కుమార్ అనే పోలీసుఅధికారి.. పరకామణిలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశారు. కోర్టులో కేసు నడుస్తోంది. కొద్ది రోజుల తర్వాత నిందితుడు టీటీడీకి లేఖ రాసి… హుండీలో డబ్బులు లెక్కపెట్టేటప్పుడు తాను దొంగతనానికి పాల్పడ్డం ద్వారా పాపం చేశానని.. తన ఆస్తిని దేవుడికి రాసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్టు మీడియాలో వచ్చింది.
దాన్ని టీటీడీ ఆమోదిస్తే.. దీంతో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు గతంలో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ తన పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. ప్రస్తుతం రైల్వేలో సీఐ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ 13 వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఇంటిలో నుంచి బయటకు వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతుండగా… రాత్రి 12 గంటలకు రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఎక్కాడని టీడీపీ మీడియా చెబుతోంది. 14వ తేదీ ఉదయం 9.15 నిమిషాలకు ట్రాక్ పరిశీలన చేసే కీమెన్ సతీష్ కుమార్ మృత దేహాన్ని ఐడీ కార్డు సహాయంతో గుర్తించి.. సమాచారమిచ్చాడన్నది మీడియా కధనం. వెంటనే రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చిన పోలీసులు ఆ తర్వాత సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు.
విచిత్రంగా ఇంటిని దిగ్బంధం చేసి.. ఇల్లంతా జల్లెడ పట్టడానికి వచ్చారని కుటుంబ సభ్యుల కధనం. అదే రోజు కనీసం మృతదేహానికి పంచనామా అవ్వకుండానే… అది హత్యో, ఆత్మహత్యో తెలియకుండానే మధ్యాహ్నం 12.47 నిమిషాలకు టీవీ 5 మూర్తి పరకామణి దొంగలు ప్రాణం తీశారా? అంటూ మొదలుపెట్టాడు. తిరుమల కేసులో పోలీసునే లేపేశారా? అంటూ మరో కథనం ప్రసారం చేశారు. మహానాడు మీడియా పేరుతో మధ్యాహ్నం 2.53 నిమిషాలకు వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు…అంటూ సంబంధం లేని కధనాలు రాసి.. మరో 4 నిమిషాల తేడాతో పరిటాల హత్య కేసులో సాక్షులు వరుస మరణాలు అంటూ మరో కథనం రాసారు.
మరలా సాయంత్రం 6 గంటలకు సతీష్ కుమార్ మృతి వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది, శ్రీవారి హుండీని దొంగిలించి రాజీ చేయడం ఏంటి? రాజీ చేయడానికి ఇది పులివెందుల పంచాయితీనా? అంటూనే సతీష్ హత్య కేసులో కుట్ర కోణం ప్రభుత్వం వెలికితీస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేరుతో వార్త. వీళ్లంతా పచ్చమూక పెయిడ్ ఆర్టిస్టులు. ఎఫ్ ఐ ఆర్ రాకుండానే వీళ్లకు తోచినట్లు కథలల్లుతారు. వీళ్లకు ఎంత పోయేకాలం అంటే… 2018లో వైయస్.జగన్ పాదయాత్రలో విశాఖలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ యాదవ్ కు బ్రెయిన్ హేమరేజ్ వచ్చి కుప్పకూలిపోయాడు. ఆయన్ను బ్రతికించుకోవడం కోసం వైయస్.జగన్ చేయని ప్రయత్నం లేదు. అనేక సర్జరీలు కూడా చేశారు. ఆయన లేచి తిరగడమే కష్టం అయితే… వైయస్.జగన్ దంపతులుతో కారులో వచ్చాడని రాస్తున్నారు.
అనారోగ్యంతో మృతిపై కూడా అనుమానం అని రాస్తాడు. వైఎస్.జగన్ మామయ్య, వైయస్.భారతి తండ్రి గంగిరెడ్డి గారి గురించి రాస్తూ… ఆయన మృతికి వివేకానంద రెడ్డి హత్యకు ముడిపెడతాడు. వీరి పాపాలకు అంతు లేకుండా పోతుంది. వీటన్నింటినీ ఏమంటారు? డీజీపీ గారినికూడా ప్రశ్నిస్తున్నాను? సతీష్ కుమార్ ది ప్రభుత్వ హత్యేనని మాకు అనుమానంగా ఉందన్న కారుమూరి వెంకటరెడ్డిపై మీ తాడిపత్రి ఎస్ఐ నిన్న సాయంత్రం కేసు నమోదు చేస్తారు… మరి ఈ మీడియాలో వచ్చిన వాటిపై ఏం చెబుతారు? కనీసం శవపంచనామా జరగక్కుండా ఏ రకంగా ఇలా వార్తలు రాస్తారు? ఇంతవరకు సతీష్ కుమార్ మృతిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్, విచారణాధికారి, జిల్లా ఎస్పీ ఎవరూ ఈ హత్యలో ఫలానావాళ్లు ఉన్నారని చెప్పలేదు. గుట్టు బయటపడుతుందని భయపడ్డారా అని రాసిన ఈనాడు.. మరో పేజీలో కీలక కేసుల్లో అనుమానాస్పద మరణాలు అని మహానాడు మీడియాలో వచ్చిందే ఈనాడులో రాస్తారు.
మహానాడు మీడియా స్థాయికి ఈనాడు దిగజారిందా? అంటే తెలుగుదేశం పార్టీ ఏ కంటెంట్ అయితే తయారు చేసి ఇస్తుందో, దాన్నే మహానాడు మీడియా ముందు ప్రచారం చేస్తాడు. ఆ తర్వాత ఈనాడు తీసుకుంటుందని అమాయకులకు కూడా అర్ధం అవుతుంది. పోస్టు మార్టమ్ రిపోర్టు రాకుండా, పోలీసులు చెప్పకుండానే ఈనాడులో సతీష్ అడ్డులేకుండా పోతే తప్పించుకోవచ్చని భావించారా? సీఐడీ విచారణకు వెళ్తున్న వ్యక్తి విగత జీవిగా ఎలా మారాడు? తలవెనుక భాగంలో బలమైన ఆయుధంలో కొట్టిన గాయాలు అంటూ రాశారు.
నిజానికి ఇవాల్టి వరకు ఒక్క పోలీస్ అధికారి కూడా దీనిపై స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అన్నీ వీల్లే రాస్తారు. కాకీ చొక్కాలను అడ్డం పెట్టుకుని ప్రజలు, ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్న చంద్రబాబు దుర్మార్గాలకు ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. సతీష్ కుమార్ మృతిపై పోలీసులు నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే.. ఇష్టమొచ్చిన రీతిలో మీడియా ట్రైల్స్ నిర్వహిస్తూ… కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకముందు హత్య అంటూ వరుస కధనాలు ప్రసారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా కధనాలు ప్రసారం చేస్తున్న ఈనాడు, టీవీ 5 మూర్తి సహా ఇతరుల మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు.
విద్వేషాలు రేగేలా పోస్టు పెట్టినందుకే వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసామన్న పోలీసులకు… టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో అడ్డగోలు రాతలు కనిపించడం లేదా? అని నిలదీశారు. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజగొంగల ముఠా అంటూ అడ్డగోలు రాతలు రాస్తూ.. మీడియాలో మాట్లాడుతుంటే టీడీపీ అధ్యక్షుడ్ని, పట్టాభిని ఎందుకు అరెస్టు చేయడం లేదని పేర్ని నాని నిలదీశారు. వైఎస్.జగన్ ని ప్రేమిస్తూ.. వైయస్సార్సీపీ జెండా పట్టుకున్న ఏ వైయస్సార్సీపీ కార్యకర్త అయినా అదిరేది లేదు, బెదిరేరి లేదు, ఈ విషయాన్ని నీ కొడుకు లోకేష్ కి కూడా చెప్పు చంద్రబాబూ. వైయస్సార్సీపీ తరపున పోలీసధికారులను ప్రశ్నిస్తున్నాం? ప్రజలనూ ఆలోచన చేయమని చెబుతున్నాం. సతీష్ మృతి దేహం దగ్గరకు రెండు గంటలపాటు ఇతర మీడియాను, కుటుంబసభ్యులను, అన్నదమ్ములను, భార్యను రానివ్వకుండా… కేవలం టీవీ5 ని మాత్రమే ఎలా అనుమతించారు.
దీనికి ఎవరు సమాధానం చెబుతారు? టీవీ5 తప్ప మీ అనుకూల చానెల్స్ ని కూడా ఎందుకు అనుమతించలేదు. మరోవైపు ప్రభుత్వం తాజాగా ఓ జీవో విడుదల చేసింది. అందులో ఈనాడు సంస్థలకు చెందిన ఈటీవీలో వచ్చిన కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమం మధ్యలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి, ప్రభుత్వం గురించి ప్రచారం చేసినందుకు రూ.90 లక్షలు ప్రకటనల కోసం విడుదల చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచే సతీష్ కుమార్ ది హత్య, వైయస్.జగన్ చేశాడంటూ వార్తల్లో ప్రచారం చేసిన టీవీ5 మూర్తిని మీరు హైదరాబాద్ వెళ్లి ప్రశ్నించారా? ఆయన వద్ద నున్న ఆధారాలు తీసుకోరా? వైయస్సార్సీపీ నేతలైతే తీసుకెళ్తారా? టీవీ5 మూర్తిని ఎందుకు ఎత్తుకెళ్లరు ?