– ఉప్పల హారిక పై దాడి అమానుషం
– బీసీ మహిళపై దాడి చేసేందుకు సిగ్గులేదా?
-మాజీ ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు
విజయవాడ: బీసీకి చెందిన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై టీడీపీ గుండాలు దాడి చేసి, ఆమె కారు ధ్వంసం చేయడం పిరికిపందల చర్య అని మాజీ ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు ఖండించారు. ఒక బీసీ మహిళపై దాడిచేసేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
పోలీసుల సమక్షంలోనే ఒక బీసీ మహిళపై దాడి జరిగితే ఇక రాష్ట్రంలోని సామాన్య బీసీ మహిళలకు రక్షణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఈ రాష్ట్రంలో నడుస్తోంది పోలీసు రాజ్యమా? గూండా రాజ్యమా? లేక ఇద్దరూ కలసి పాలిస్తున్నారా? మహిళలకు కూటమి కల్పించే రక్షణ ఇదేనా? ఒక బీసీమహిళపై టీడీపీ నేతలు చేసిన దాడి, హత్యాయత్నానికి పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారు’’ అని విష్ణు ప్రశ్నించారు.