– సానా సతీష్‌తో కమల్ హాసన్ సరదా చిట్‌చాట్
న్యూఢిల్తీ: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కమల్ హాసన్, సానా సతీష్ బాబు మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఆసక్తి రేపింది. వీళ్ళు నడుస్తూ, “మీ ఇన్నేళ్ల సినిమా కెరీర్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది?” అని సానా ప్రశ్నించగా, కమల్ హాసన్ చిరునవ్వుతో “ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం…” అనే పంక్తిని గుర్తుచేశారు. ఇది ఆకలి రాజ్యం సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ కాగా, అసలైన మూలం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కావ్యంలోనిది.
ఆకలి రాజ్యం(1981) దర్శకుడు కె.బాలచందర్ రూపొందించిన సామాజిక స్పృహ కలిగిన చిత్రం. నిరుద్యోగం, సామాజిక అసమానత, మానవ విలువల గురించి లోతుగా చెప్పిన ఈ సినిమా, తెలుగు చలనచిత్ర చరిత్రలో క్లాసిక్‌గా నిలిచింది.
ఇంతలో సభ మళ్లీ ప్రారంభం కావడంతో, ఇద్దరూ రాజ్యసభ హాలులోకి ప్రవేశించారు. ఈ సరదా సంభాషణను అక్కడున్న వారంతా ఆసక్తిగా ఆస్వాదించారు.