– తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ము లేకనే వైసీపీ అడ్డదారులు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ఎన్నికలు ఏవైనా సరే వైసీపీ మాత్రం అదే అరాచకం, అక్రమాలకి పాల్పడుతూ ప్రజాస్వామ్యన్ని కూనీ చేస్తోంది. టౌన్ బ్యాంకు ఎన్నికల్లో వైసీపీ గెలిచే దమ్ములేక అడ్డదారులు తొక్కుతోంది. టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటున్నారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారు. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు.? వైసీపీ నేతలును ఎందుకు హౌస్ అరెస్టులు చేయలేదు. పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి, నియంతల్లా వ్యవహరిస్తున్నారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు.
టీడీపీ వాళ్లను ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు ఇక ఎన్నికలెందుకు.? మూడేళ్లుగా దోచుకున్న డబ్బును అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారు. వైసీపీ అధికారం బలంతో, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఓటమి తప్పదు.