– టీ షాట్ ,బీ ఆర్ కే భవన్ ,హాకా భవన్ లోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఫేక్ ప్రచారం
– తెలంగాణ రైజింగ్ టాక్ కమ్యూనికేషన్ పేరుతో వాట్సాప్ గ్రూప్
– సిట్ చీఫ్ గా సజ్జనార్ ఏం చేస్తున్నారు?
– ప్రభుత్వ జీతం తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ ప్రతిపక్షాల మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు
– బాట్స్ అకౌంట్ ద్వారా బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేస్తున్నారు
– కాంగ్రెస్ బాట్స్ ఆర్మీ కాలకేయ సైన్యం ఘోరంగా తయారైంది
– శ్రీరామ్ కర్రీ ఓ క్రిమినల్
– తక్షణం ఆయనపై కేసు నమోదు చేయాలి
– సోషల్ మీడియా లో ప్రభుత్వ డబ్బుతో బీ ఆర్ ఎస్ పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బట్టబయలు చేసిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు , బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దేశం లోనే అత్యంత మిస్ ఇన్ఫర్మేషన్ మాఫియా గా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షం లో ఉండగా తోటి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పై సోషల్ మీడియా లో ఫేక్ ప్రచారం నడిపారు. ఉత్తమ్ తన వ్యక్తిత్వహననం మీద రేవంత్ పై బహిరంగంగానే మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ పై జరుగుతున్న సిట్ విచారణ పై ఫేక్ వార్తలు ప్రచారం చేసేందుకు సీఎంఓ లో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. అక్కడనుంచే నకిలీ వార్తలు సర్క్యూలేట్ అవుతున్నాయని మేము ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. 138 సభ్యులున్న సీఎంఓ వాట్సాప్ గ్రూప్ నుంచి, తెలంగాణ ఉద్యమ కారుడు ఒకరు విజిల్ బ్లోవర్ గా వ్యవహరించి స్క్రీన్ షాట్ పంపితే అసలు విషయాలు తెలిశాయి.
తెలంగాణ రైజింగ్ టాక్ కమ్యూనికేషన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ నడుస్తోంది. సీఎం పీ ఆర్ ఓ అన్వేష్ ,మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ ,కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జీ సతీష్ మన్నే , తదితరులు ఈ వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు. సీఎంఓ నుంచే ఈ తతంగం నడుస్తోంది. సిట్ చీఫ్ గా సజ్జనార్ ఏం చేస్తున్నారు
ప్రభుత్వ జీతం తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ ప్రతిపక్షాల మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అన్వేష్ కూడా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. వేల బాట్స్ అకౌంట్స్ సృష్టిస్తూ తప్పుడు ప్రచారం సర్క్యూలేట్ చేస్తున్నారు. సిట్ నుంచి అధికారకంగా రిలీజ్ కాకున్నా, బాట్స్ అకౌంట్ ద్వారా బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేస్తున్నారు
శ్రీరామ్ కర్రీ ఓ క్రిమినల్. ఆయనపై కేసు నమోదు చేయాలి. మీడియా డైరెక్టర్ భాద్యతల నుంచి వెంటనే తప్పించాలి. ఇది డేంజరస్ మాఫియాగా మారి ఈ వాట్సాప్ గ్రూప్ నడిపిస్తోంది. కే టీ ఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి సీఎం రేవంత్ ప్రోద్భలంతో శ్రీరామ్ కర్రీ ,అన్వేష్ ,మన్నే సతీష్ పని చేస్తున్నారు
బాట్స్ అకౌంట్స్ ఉన్న వాళ్ళే సీఎం ప్రసంగాలను సోషల్ మీడియా లో అహో ఓహో అని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పేరడీ అకౌంట్స్ పేరిట బీ ఆర్ ఎస్ మీద వండి వార్చిన కథనాలు సమాజంలోకి వదులుతున్నారు. కాంగ్రెస్ బాట్స్ ఆర్మీ కాలకేయ సైన్యం ఘోరంగా తయారైంది. ఈ వికృత క్రీడ ను డీజీపీ అరికట్టాలి. ఫేక్ న్యూస్ ను ప్రభుత్వం అరికట్టాలి
అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుండి ఫేక్ న్యూస్ ను బరితెగించి ప్రచారం చేస్తోంది. సీఎంఓ నుంచే ఈ ఫేక్ న్యూస్ ముఠా నడుస్తోందని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాం. ఎన్నో సార్లు డీజీపీ కి ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ నేతలపై చర్యలు లేవు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బీ ఆర్ ఎస్ మహిళలపై వ్యక్తిత్వహనానికి పాల్పడుతున్నారు. టీ షాట్ ,బీ ఆర్ కే భవన్ ,హాకా భవన్ లోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఫేక్ ప్రచారం నడుస్తోంది
గత సంవత్సరం ఆగస్టు 29 న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఫేక్ ప్రచారం నడుస్తోందని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఆధారాలు సమర్పించినా చర్యలు లేవు. వందలాది మంది ప్రభుత్వ అధికారులను బీ ఆర్ ఎస్ మీద దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు. అనుముల రాజ్యాంగం లో బీ ఆర్ ఎస్ చేసిన ఏ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
ఇదో వ్యవస్థీకృతమైన నేరం లా మారింది. వచ్చేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే మేము తీసుకుంటాం. రాష్ట్రంలో లేని సాంప్రదాయాలను తీసుకొస్తున్నారు. పద్దతి మార్చుకోని అధికారులను మేము అధికారం లోకి వచ్చాక చట్టం పరిధిలో శిక్షిస్తాం