-నేను నీతి మంతుడినని చెప్పడం లేదు
-తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టా
-జగన్‌కు కూడా మా మీద అభిమానం ఉండాలి కదా?
– మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు
30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీచేస్తా.. మరో నియోజకవర్గానికి వెళ్లను. అందరూ కలిసి పని చేస్తానంటేనే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా . ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పా. నేను నీతి మంతుడినని చెప్పడం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నా. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టాను. తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగి మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు . తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి తపనపడ్డాడు. మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం రద్దుచేసుకున్నా. జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడు జగన్‌కు కూడా మా మీద అభిమానం ఉండాలి కదా ?