Suryaa.co.in

Telangana

నేడు కమ్మనైన కర్ణాటకం.!

-కమ్మవాళ్ళ ముందు బీజేపీ ఆరెస్సెస్ కుప్పిగంతులు పనికిరావని ఎప్పుడు తెలుసుకుంటారో?
-కమ్మవాళ్లంటే పుష్పాలు అనుకుంటిరా? కమ్మవాళ్ళు అంటే ఫైర్
-ఆరెస్సెస్ నాయకుడు భాగయ్య నాటిన కమ్మ వ్యతిరేక విషబీజాల
-ఫలితమే కర్నాటక పరాజయం
-అది మిగిలిన రాష్ట్రాల్లోనూ పునరావృతం

రేపు కమ్మనైన తెలంగాణం, ఆంధ్రం, తమిళనాడు.!
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం/తారుమారు చేసిన కమ్మవారు.

కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజవర్గాలలోనూ మరియు బెంగుళూరు పట్టణంలోనూ స్థిరపడిన కమ్మవారు కర్ణాటక అసెంబ్లీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెసు వైపు నిలబడి కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఎవరైనా కావాలంటే ఓటింగ్ శాతాన్ని డేటాను పరిశీలించుకోవచ్చు.
ఆ నలభై నియోజకవర్గాలలో కాంగ్రెసు గెలవడంలో కమ్మవారి పాత్ర గణనీయమైనది, బీజేపీ చేస్తున్న కమ్మవ్యతిరేక కుట్రకు వ్యతిరేకంగా అక్కడ స్థిరపడిన కమ్మవారు కలతచెంది ముక్తకంఠంతో కాంగ్రెసు పార్టీ వైపు నిలబడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరెస్సెస్ నాయకుడు శ్రీ భాగయ్య నాటిన కమ్మ వ్యతిరేక విషబీజాల యొక్క ఫలితాలను, ఇకమీదట బీజేపీ దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో చవిచూడబోతోంది అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

జాతీయభావాలతో ఉండాల్సిన శ్రీ భాగయ్య సంకుచితత్వంతో వ్యవహరిస్తూ, కమ్మ వ్యతిరేక వర్గాలతో జట్టుకలిసి, అటు కమ్మవాళ్ళను, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అన్నివిధాలా అడ్డుకోవడం చేశారు. శ్రీ భాగయ్య రెండు తెలుగు రాష్ట్రాలలోని కొంతమంది రాజకీయ భస్మాసురులను చేరదీసి, వాళ్లకు వరాలు ఇచ్చారు, ఆ భస్మాసురులే నేడు దక్షిణభారతదేశంలో బీజేపీని భస్మం చేయబోతున్నారు, వాళ్ళు బీజేపీ పాలిట యమకింకరులుగా మారారు, అయినా కూడా బీజేపీ ఇంకా ఆ అభస్మాసురులనే అన్నివిధాలా కాపాడుతోంది రక్షిస్తోంది.

ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు.
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత.
చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోకపోతే ఎవరికి నష్టం?
విజ్ఞతతో నేడు ఆరెస్సెస్ బీజేపీ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఇది కేవలం టీజర్ లాంటిది మాత్రమే, రాబోయేఎన్నికల్లో ఆత్మగౌరవం కలిగిన కమ్మవాళ్ళు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీకి అన్ని రుచులూ చూపిస్తారు.
బీజేపీ ఆరెస్సెస్ వాళ్లకు కేవలం నటించడం మాత్రమే వచ్చు, కానీ….కమ్మవాళ్లకు ఎవరు ఎంతమేరకు నటిస్తున్నారో బేరీజు వేసి, వాళ్లకు అవార్డులు ఇచ్చే ఆస్కార్ జ్యురీ సభ్యులు లాంటివాళ్ళు, కమ్మవాళ్ళ ముందు బీజేపీ ఆరెస్సెస్ కుప్పిగంతులు పనికిరావని ఎప్పుడు తెలుసుకుంటారో?ఏమో? పాపం.!
మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లూ అంతే దూరం. వెనక్కి తగ్గేదెల్యే…
కమ్మవాళ్లంటే పుష్పాలు అనుకుంటిరా? కమ్మవాళ్ళు అంటే ఫైర్.
మా శత్రువులను మీపక్కలో పెట్టుకుని, వాళ్ళతో మమ్మల్ని కొట్టాలని చూస్తే, వాళ్ళ వలనే మీ పతనం తధ్యం, తస్మాత్ జాగ్రత్త.!

కలుపుకు పోవాల్సిన వాళ్ళను, ఉద్దేశ్యపూర్వకంగా పక్కనబెట్టి అవమానించి హింసిస్తే, ఆవుల కొమ్ముల్లో కూడా కత్తులు మొలుస్తాయి కదా!
నిరంతరం సమాజహితం కోసం శ్రమించే కమ్మవాళ్ళు ఎవరికీ శత్రువులు కాదు, సమాజాన్ని పాతిక సంవత్సరాల తరువాత ఏమి మార్పు జరగబోతుందో ఎప్పటికప్పుడు ఊహించి, దూరదృష్టతో దీర్ఘదృష్టితో మార్గదర్శనంతో ముందుకెళ్లే కమ్మవాళ్లకు సమాజంలో ప్రతిపేదా ఆత్మబంధువే, కమ్మవాళ్లకు సమాజంలో అన్నిరకాల అణచివేతకు గురయ్యే వర్గాలు అన్నీ బంధువులే, సమాజశ్రేయస్సే కమ్మవారికి ప్రాధాన్యం, సమసమాజము సమానత్వమే కమ్మవారి డీఎన్ఏ, ధర్మరక్షణే కమ్మవారి ధ్యేయం, కమ్మవారు పండించే పంట, పాడి, చేసే ఉత్పత్తులు, శ్రమ, ఉపాధికల్పన అన్నీ సమాజంకోసమే.! ఇది తెలుసుకుని కమ్మవారితో ఆత్మీయంగా సన్నిహితంగా ఆత్మీయతతో స్నేహపూర్వకంగా మెసలుకున్నవాళ్ళు బాగుపడతారు.

-సువేరా

LEAVE A RESPONSE