– ఏ దళారుల వద్ద నిల్వచేస్తున్నారు?
– రేవంత్ రెడ్డి జిల్లాను గాలికొదిలేశారు
– రాష్ట్రానికి అవసరమైనదానికంటే ఎక్కువగా యూరియా సరఫరా
– స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు
నారాయణపేట: జిల్లా ప్రజలతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నారాయణపేట ప్రాంతం నుంచి మంచి మద్దతు లభించింది. అనేక కార్యక్రమాల కోసం ఇక్కడ పర్యటించాను. నారాయణపేట జిల్లా నిర్మాణానికి ముందే అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో నేను కూడా పాల్గొన్నాను.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో నారాయణపేట, ములుగు ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కోరాం. శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి, నారాయణపేట, ములుగు ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రెండు ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశాను. ఆపై అవి జిల్లాలుగా ప్రకటించారు.
కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తవ్వాలని కౌన్సిల్లో మాట్లాడాను. ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాను. నారాయణపేట జిల్లాను ఆనుకుని ఉన్న కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం. ఈ నియోజకవర్గానికి వేలకోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి. ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు ఖర్చు చేశారో వెల్లడించాలి.
GO 69 తీసుకురావడానికి ఈ జిల్లా ముఖ్య నేతలు ఎంతో పోరాడారు. మహబూబ్‌నగర్ తన సొంత జిల్లా అని చెబుతూ, ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కానీ 19 నెలల పాలనలో ఎంత బడ్జెట్ కేటాయించారో చెప్పాలి.
రేవంత్ రెడ్డి ఈ జిల్లాను, తన సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజాసమస్యలను గాలికొదిలేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం మార్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయమే. యూరియా కొరత ఉందని, కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి అవసరమైనదానికంటే ఎక్కువగా యూరియా సరఫరా చేసింది.
రాష్ట్రానికి అవసరమైన యూరియా: 9.5 లక్షల మెట్రిక్ టన్నులు. కేంద్రం పంపిన యూరియా 12.02 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల టన్నుల అదనపు సరఫరా. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొంతమంది దళారులు యూరియాను దాచిపెట్టేందుకు ప్రోత్సహిస్తోంది.
అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన యూరియా ఎక్కడ దాచిపెడుతున్నారు? ఏ దళారుల వద్ద నిల్వచేస్తున్నారు? ఫెర్టిలైజర్ షాపుల నుంచి దళారులు మార్కెట్‌కి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు, యువతకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇది BCల పట్ల కూడా వ్యతిరేక దృక్పథం కలిగిన ప్రభుత్వం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. అందులో మతపరంగా 10 శాతం రిజర్వేషన్లు కలుపాలనుకోవడం సరైంది కాదు. చేనేతకు పేరు నారాయణపేట. అలాంటి ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు జడ్పీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది.
ప్రజలు మార్పు కోరుతున్నారు. బీజేపీపై విశ్వాసం చూపుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను చూశారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాల పాలనను చూశారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి. మనమంతా కట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం. రాబోయే రోజుల్లో వికసిత్ తెలంగాణగా మారాలంటే బిజెపి విజయం సాధించాలి.