– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కడప ఉక్కుఫ్యాక్టరీ మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజు మీరిచ్చిన హామీ గుర్తుందా కోతల రెడ్డి గారూ. మీరు టెంకాయ కొట్టి నేటికి మూడేళ్లయ్యింది. ఉక్కు ఫ్యాక్టరీ ఏదీ? ఎక్కడ? ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి, 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఊరించి ఉసూరుమనిపించారు. కన్నతల్లిలాంటి కడపకి, రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ గడ్డకి జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారు . శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం చంద్రబాబు గారి విజనరీ పాలన. శంకుస్థాపనచేసి మరిచిపోవడం జగన్ రెడ్డి గారి ప్రిజనరీ పాలన. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, సాక్షి, భారతి సిమెంట్ కోసం బటన్ నొక్కి కోట్లు నొక్కేసే కోతల రెడ్డిగారూ..కడప ఉక్కుఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఓ సారి బటన్ నొక్కండి.