– బతుకమ్మ పండగలో మహిళలకు గౌరవమేదీ?
– కేసీఆర్ హయాంలో చీరల పంపిణీ
– ఇప్పుడు బతుకమ్మ కూడా సరిగా నిర్వహించలేని వైఫల్యం
– జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మీడియా సమావేశం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, వేలాది మహిళలు రోడ్లపై, గ్రౌండ్లలో బతుకమ్మ ఆడుతూ సాంప్రదాయ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ఉద్యమ కాలంలో కేసీఆర్ బతుకమ్మను ఉద్యమ బావుటాగా ఎగరేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక చేతిలో జొన్న కంకి, మరో చేతిలో బతుకమ్మతో తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని రగిలించారని గుర్తు చేశారు. కానీ కొంతమంది ద్రోహులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, బోడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
షేక్‌పేట్ సక్కుబాయి గ్రౌండ్స్‌లో రేపు ఘనంగా బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కాలంలో మహిళలకు చీరలు పంపిణీ చేసేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నామని వివరించారు.
నగర పరిస్థితిపై మాట్లాడుతూ.. హైద్రాబాద్‌లో చెత్త సమస్య మరింత తీవ్రమైందని, గార్బేజ్ తొలగింపు సక్రమంగా లేకపోవడం, మురుగు నీటి వ్యవస్థ దెబ్బతినడం, రోడ్లు అధ్వాన్నంగా మారడం వల్ల నగరం గార్బేజ్బాద్గా మారుతోందని విమర్శించారు. కేటీఆర్ నాయకత్వంలో జీహెచ్ఎంసీ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. “ప్రజల సమస్యలను విస్మరించే పాలకులు ఓట్లు అడగడానికి వస్తే, ప్రజలు తప్పక ఎదురు తిరగాలి” అని దాసోజు శ్రావణ్ హితవు పలికారు.
ఈ సమావేశంలో షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ , బీఆర్ఎస్ మైనారిటీ చైర్మన్ ముజీబుద్దీన్ , మస్సి ఉల్లాహ్ ఖాన్ , ముఠా జయసింహ , అర్షద్ నవాబ్ గా పాల్గొన్నారు.