బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అధికారం ఉన్నా లేకున్నా తాము తెలంగాణ సేవకులమన్నది మరిచిపోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు.
కష్టపడి పనిచేసిందుకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. తెలంగాణను దేవుడు దీవించుగాక అని పేర్కొన్నారు.