-దళితుడినని చెప్పుకునే అర్హత నాగార్జునకు లేదు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
నిండు సభలో దళిత మాతృమూర్తులను అవమానించిన మంత్రి మేరుగ నాగార్జున మరలా సిగ్గులేకుండా సమర్థించుకుంటూ మాట్లాడటం అత్యంత బాధాకరం. గతంలో చంద్రబాబుగారు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి పాలన చేశారు. దళిత సంక్షేమానికి సాధికారత తీసుకొచ్చారు. కానీ, నేడు జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, దళితులకు రావాల్సిన హక్కులను, పథకాలను తుంగలో తొక్కుతున్నా.. మాట్లాడలేని నువ్వు నిజమైన దళితుడవో కాదో డీ.ఎన్.ఏ టెస్ట్ చేయించుకో.
దళితులకు రాజ్యాంగపరంగా ఏర్పడిన పథకాలను జగన్ రెడ్డి హరిస్తుంటే అంటీముట్టనట్టు ప్రవర్తిస్తున్న నువ్వు దళితుడికి పుట్టావో లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. దళితులను వైసీపీ నాయకులు అత్యంత కిరాతకంగా చంపుతుంటే, వేధిస్తుంటే, అక్రమ కేసుల్లో ఇరికిస్తుంటే, అత్యాచారాలకు పాల్పడుతుంటే మాట్లాడలేకపోతున్న నువ్వు దళితులకు పుట్టావో, లేదో టెస్టు చేయించుకుంటే మంచిది. అసలు నిజంగా నువ్వు దళితుడివే అయితే, మరో దళితుడిని అవమానించవు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్ ను అడ్డుపెట్టుకుని, ఉద్యోగం సంపాదించి, మంత్రి అయ్యి సాటి దళితుడిని రాష్ట్ర చట్టసభల్లో అవమానించడం అంటే నువ్వు దళిత ద్రోహివి అని రాష్ట్రమంతా అర్థమైంది.
దళితులు స్వశక్తితో బ్రతికేందుకు చంద్రబాబుగారు ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలు అమలు చేశారు. దళితులకు భూమి కొనుగోలు పథకం తెచ్చి, పాలేరు వ్యవస్థ నుండి రైతు స్థాయికి తీసుకొచ్చారు. ఇటువంటి మహోన్నతమైన పథకాలను రద్దు చేసిన మూర్ఖుడు జగన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడలేకపోవడం దళిత ద్రోహమే. దళితుల ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతిపక్షంలో ఉన్నా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సాటి దళిత సభ్యుడి పుట్టుకను కించపరిచిన నువ్వు దళితుడినని చెప్పుకునే అర్హతను కోల్పోయావు. దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో చంద్రబాబుగారు విదేశీవిద్య పథకాన్ని అమలు చేశారు.
ఆ మహనీయుడి పేరును తొలగించి జగన్ తన పేరు తగిలించుకుంటే కనీసం పల్లెత్తి మాట మాట్లాడకపోవడం దళిత ద్రోహం కాదా నాగార్జున? ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దోచుకుంటే కూడా నువ్వు మాట్లాడలేదంటే నువ్వు నిజంగా దళితుడివో కాదో తేల్చుకోవాలి. లేదంటే నువ్వు నిజంగా దళితుడివైతే ఏ అసెంబ్లీ సాక్షిగా సాటి దళితుడిని, తన పుట్టుకను, దళిత మాతృమూర్తుల శీలాన్ని కించపరిచావో అదే అసెంబ్లీ సాక్షిగా ఆ దళిత శాసన సభ్యుడు డోలా బాలవీరాంనేయస్వామిగారికి, రాష్ట్రంలోని దళితులందరికీ బేషరతుగా సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఇలా చేయకపోతే రాష్ట్ర దళితుల ఆత్మగౌరవాన్ని అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి కాళ్ల వద్ద తాకట్టుపెట్టినట్టేనని భావించాలి.