– శ్వేతపత్రం విడుదల చేయాలి
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్
ఏలూరు: రహదారులు ప్రమాదకర స్థితిలో ఉన్నా ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రభు త్వనికి రు 4 వేల కోట్లు, గత తెలుగుదేశం ప్రభుత్వానికి రు 5 వేల కోట్ల రూపాయల నరేగా నిధులను కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చాక రహదారులు నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కి తీసుకున్న చర్యలు ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా రహదారులన్ని పాడయ్య దుస్థితిలో ఉన్న ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో ని అమ్మ వార్ల ఆలయాల ప్రాంగణంలో భక్తులు ఆర్థిక సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని సోము వీర్రాజు శనివారం ప్రారంభించారు.అమ్మవారిని దర్శించుకున్నారు.