Suryaa.co.in

Telangana

అక్రమ నిర్మాణాలపై కొరడా

-ఇబ్రహీంబాగ్ చెరువు బఫర్ లో అక్రమ విల్లాల కూల్చివేత
-హెచ్ఎండిఏ – మణికొండ మున్సిపాలిటీ జాయింట్ ఆపరేషన్ నేలమట్టమైన ఆరు విల్లాలు

హైదరాబాద్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంబాగ్ చెరువు బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జులిపించింది.

ఇబ్రహీం బాగ్ చెరువు బఫర్ జోన్ సర్వే నెంబర్లు 53, 54 పరిధిలో లేక్ వ్యూ విల్లాస్ పేరిట అక్రమంగా నిర్మించిన అరు(6) విల్లాల నిర్మాణాలపై హెచ్ఎండిఏ – మణికొండ మున్సిపల్ అధికారులు బుధవారం జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిర్మాణదశలో ఉన్న ఆరు విల్లాలను కూల్చివేశారు.

పక్క ప్రణాళికతో బుధవారం ఉదయం మణికొండ మున్సిపల్ కమిషనర్ ఫల్గున్ కుమార్, హెచ్ఎండిఏ ఎన్ ఫోర్స్ మెంట్ డి.ఎస్.పి (ఇంచార్జ్) వెంకటేష్ ల నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులు, నార్సింగి పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం 8 గంటల నుండి జాయింట్ ఆపరేషన్ ప్రారంభించి మధ్యాహ్నం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

LEAVE A RESPONSE