– కులం మార్పును మనుధర్మం అంగీకరిస్తుందా?
ముద్రగడ పద్మనాభం మాజీ కాపు నేత. తనను తాను “సామాజిక న్యాయ పోరాట యోధుడు”గా ప్రచారం చేసుకున్న నేత. ప్రస్తుత పద్మనాభరెడ్డి 2024 ఎన్నికల ప్రచార సమయంలో చేసిన సవాల్ ఏంటి?
వైసీపీ వృద్ధ నేతగా, వీర కాపు అని చెప్పుకునే ముద్రగడ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బహిరంగ సవాల్ విసిరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తాను ఒకవేళ అలా జరక్కపోతే, నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ప్రకటించారు.
ఒక కాపు రెడ్డి అవుతాడా అంటే అవకాశమే లేదు. దానికి మనువు ఒప్పుకోడు. మీకు ఇష్టం లేకపోతే దేవుడిని అయినా మార్చేయవచ్చు… అదెలా అంటారా..? మతం మారితే దేవుడుని మార్చినట్టే కదా? అది వ్యక్తిగత ఎంపిక. కానీ కులం మార్చుకోవడాని కుదురుతుందా?
సనాతన మను ధర్మ శాస్త్రం మనుస్మృతి చెప్పింది ఏంటంటే.. కులం పుట్టుకతోనే నిర్ణయమవుతుంది అని తేల్చేసింది.. అసలు నిజం ఏమిటంటే: ఎవరు ఏ కులంలో పుట్టాలో పుట్టేవాడికి సంబంధం లేదు. పుట్టిన తర్వాత ఆ కులాన్ని చనిపోయేవరకు మోసుకెళ్లాలా వద్దా అనేది వ్యక్తిగత ఇష్టం. ఆ ఇష్టం లేకపోతే, మతం మారితే సిద్ధాంతపరంగా కులం పోవాలి.
కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది? మతం మారినా… కులం తోక వదలడం లేదు? కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. మతం మారినా కులం మాత్రం వదలడం లేదు. ఉదాహరణకు వైఎస్ కుటుంబం మతం క్రిస్టియన్ అయినా కూడా, పిల్లా- జెల్లా ఆడ మగా పేరు చివర “రెడ్డి” తోక మాత్రం తప్పనిసరి చేసుకుంటున్నారు.! అదే కోవలో మోసెస్ చౌదరి లాంటి అనేక క్రిస్టియన్ మత ప్రచారకులది అదే పరిస్థితి.
పద్మనాభరెడ్డి విషయానికి వస్తే .. ఎన్నికల్లో జనసేనాని గెలుపొందటం కారణంగా పద్మనాభం కాస్తా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రచురించింది. అధికారిక ప్రచురణ విభాగం కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం వారు, ఫ్రైవేటు ప్రకటన పేరు మార్పుగా పేర్కొంటూ.. మారిన పేరు చట్టపరమైన భాధ్యత ప్రభుత్యానికి సంబంధం లేదు. లీగల్ సవాళ్ళు ప్రభుత్యానికి సంబంధం లేదు అని అదే గెజిట్‌లో ప్రకటించిన మీదట పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డి అయ్యారు.
ఈ పేరు మార్పు అంశంపై మాజీ హోం మంత్రి యం వీ మైసూరా రెడ్డి అపట్లో స్పందిస్తూ.. కాపు కులం నుండి రెడ్డిగా ఎలా మారతారు.? అసలు అలా ఎలా ప్రకటిస్తారు? అంటే మా రెడ్డి కులం కాపుల కంటే తక్కువ కులం అని ముద్రగడ భావిస్తున్నారా? అని ఒక ఇంటర్యూలో ప్రశ్నించారు.
నేను ముందే చెప్పాను కదా కులం మార్చడం కుదరదు.. మార్చుకుంటాను అంటే మను చట్టం ఒప్పుకోదు. సరే కులం పేరు మార్పు పక్కనపెట్టి పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన ఉత్తరం సంగతి చూద్దాం..
నారా చంద్రబాబునాయుడు గారికి, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి అని మొదలు పెట్టి.. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని, మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని, ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకూ న్యాయమండి.
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదాండి? తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదని సి.బి.ఐ వారు రిపోర్టు ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్దమని తేలిపోయింది. మా తండ్రి గారు ఎప్పుడూ అబద్దం ఆడవద్దు. ఒక అబద్దానికి 100 అబద్దాలు చెప్పినా సరి చేయలేము అని చెప్పేవారండి అని ఆ ఉత్తరంలో రాసుకొచ్చారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కులం మార్చుకున్న వ్యక్తి చెబుతున్న మాటలు ఇవి.
చంద్రబాబు పరిపాలనలో ఎంత సేపు కాపు కులాన్నే టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈ రోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. గతంలో ఈ కులానికి, మీకు అధికారం రావడం కోసం బి.సి రిజర్వేషను ఇస్తానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం అందరికి తెలిసిందే, కాపు కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిపై ప్రేమతో మీకు మద్దత్తు ఇవ్వడం జరిగిందని , వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైలులో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతీ, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా? అయినా కాపు కులం మీద ఎప్పుడూ మీరు రగిలిపోతానే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ఇట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి.
పద్మనాభరెడ్డి రాసిన తాజా లేఖ చదివితే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజల కోసం రాసిన లేఖ కాదు, వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం రాసిన లేఖ కాదు. కాపు కులం కోసం అసలే కాదు. తాను రెడ్డి అయిపోయాను అని ప్రకటించుకున్నారు కాబట్టి… ఈ చల్లారిన ఉత్తరం తన ఇష్టుడు జగన్ పాలనా వైఫల్యాలు తిరుమల మహా పాపం కప్పిపుచ్చే కపటత్వంతో చేసిన ప్రయత్నం.
దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను అధికారానికి దాసుడుగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్న ముద్రగడ.. పదవులు దక్కనప్పుడు మాత్రమే సామాజిక న్యాయం గుర్తుకు తెచ్చుకోవడం ఆయన రాజకీయ నైతికత విలువ. కాపు కులం పేరు చెప్పుకుని… రాజకీయ లాభాలు కొట్టేసిన చరిత్ర ముద్రగడ సొంతం.
కాపుల కోసం పోరాటమంటూ రోడ్లెక్కారు. రైలు దగ్ధం అయ్యింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. మీ పోరాటాల ఫలితం ఏమిటి? జగన్ అధికారం కాపులకు న్యాయం జరిగిందా? లేక ముద్రగడకు మాత్రమే రాజకీయ ప్రాముఖ్యత దక్కిందా? మీ వ్యక్తిగత స్వార్థానికి అహంకారానికి ఏ ప్రజలను బలిచేశారు? జగన్ మోహన్ రెడ్డికి కష్టం వచ్చినప్పుడే లేఖలు, హెచ్చరికలు, ముసలి కన్నీళ్లు అనేది ఇప్పటికి ఎన్నోసార్లు రుజువు చేసారు. ధర్మం న్యాయం ఉపన్యాసాలా? మీ గతం చూసుకున్నారా? సొంత అవసరాల కోసం పార్టీలు మారినప్పుడు మీ ధర్మం ఎక్కడుంది? అధికారానికి దగ్గరగా జగన్ చంకలో ఉన్నప్పుడు న్యాయం ఎందుకు గుర్తుకు రాలేదు?
రాజకీయ అవకాశవాదానికి “సామాజిక ఉద్యమం” ముసుగు వేయడం మానేయండి. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని జగన్ రెడ్డే సహాసం చేయలేదు. జగన్ బంటు సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి విషయం విచారణలో ఉందని అని ప్రకటించారు. అంతే కాని అసలు పాలే లేకుండా నెయ్యి లేకుండా నెయ్యి లాంటి నెయ్యి సరఫరా చేసిన సమయంలో పనిచేసిన ఈ ఓ సింఘాల్ ఇంటికి పోయారు.
వైవీ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో కోట్ల లావాదేవీలు జరిగాయి. సీబీఐ చెప్పిన దానికి భిన్నంగా పద్మనాభరెడ్డి ఎందుకు వక్రీకరిస్తున్నారు.? వైసీపీ మోజులో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అనే సామెత మాదిరి.. పద్మనాభరెడ్డి పేరుతో వండిన విషపు పాయసం లేఖ తో ప్రజలు భావోద్వేగాలకు మోసపోరు.
ఉత్తరాల నాటకాల నకిలీ ఉద్యమాకారులగా చెలామణీ అయ్యే వారి మాట చెల్లని కాసుతో సమానం…
పద్మనాభ రెడ్డి గారి లేఖ విషయం జోగి రమేష్ వద్ద ప్రస్తావిస్తే పద్మనాభ రెడ్డికి చిప్పు పూర్తిగా దొబ్బింది అంటారేమో…
– మేడసాని శుభకర్
జర్నలిస్టు