– ఆ పాప కర్మను కులాలకు వాటా వేస్తారా?
టెండర్ నిబంధనలు మార్చి, పీఏ చిన్న అప్పన్న ద్వారా కోట్ల రూపాయలు హవాలా రూపంలో వసూలు చేసింది వైవీ సుబ్బారెడ్డి. వాటిని కొనసాగించింది ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి.
100% కల్తీ అని సుప్రీంకోర్టు నియమించిన సిట్ (SIT) తేల్చిన సమయంలో స్పందించాల్సింది, వివరణ ఇవ్వాల్సింది ఆ ఇద్దరూ.
అంబటికి, జోగి రమేశ్‌కు దీనితో ఏమి సంబంధం? వారికి కూడా వాటాలు ఇచ్చారా?
‘ఉప్పు తిన్నాం కాబట్టి రుణం తీర్చుకోవాలి’ అన్నట్లుగా బూతులకు లంఘించారా?
ఆ బూతులకు సమాజం, పోలీసులు, న్యాయస్థానాలు స్పందిస్తే.. మధ్యలో వైకాపా ఎందుకు వారి కులాలకు అన్యాయం జరిగిందని రంగు పూస్తోంది?
వారి కులాలకు ఆ పాపపు సొమ్మును ఏమైనా పంపిణీ చేశారా? వైకాపా ఎందుకు ఆ కర్మను కులాలకు రుద్దాలని ప్రయత్నిస్తోంది? కలియుగ వైకుంఠంలో చేసిన అపచారం ఆయా కులాలకు అంటుకుంది అన్నట్లుగా ఎందుకు ఉసిగొల్పుతున్నారు?
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు?
ఆ వ్యక్తులు చేసిన పాపాలకు కులాలు, మతాలు, పార్టీలు ఎందుకు బాధ్యత వహించాలి?
సమాజం అంత అమాయకంగా ఉందని వైకాపా అంచనా వేస్తోందా?
పాతాళం స్థాయికి దిగజారి బూతులు తిడితే వైకాపా పైకి వస్తుందా? ఇక్కడి నుండి పైకి వచ్చి ‘మా ప్రతాపం చూపిస్తాం’ అని సమాజాన్ని, వ్యవస్థలను బెదిరిస్తే.. కాటేస్తాం అని బుసలు కొడితే.. ఆ విష వైకాపా(ము)కు జనం పాలు పోస్తారా?
ఇప్పుడిప్పుడే రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తున్న తరుణంలో భవిష్యత్తు మీద ఆశలు కలుగుతున్న సమయంలో.. సహనం పరీక్షిస్తే.. జనం కూడా ఒక రాయి, ఒక కర్ర వాడరా? హింస తప్పే, హింసకు విష నాలుకలు కారణం. వాటి కోరలు తీయక తప్పదు కదా? నిత్యం, బతుకంతా కాటేసుకోలేం కదా? సమాజాన్ని కాటేసే ఆ కోరలను పీకేయడం వ్యవస్థల కనీస ధర్మం కదా?
-చాకిరేవు