– విచారణకు హోం మంత్రి అనిత ఆదేశం
అమరావతి: నెల్లూరులో పోలీసులనే శాసిస్తున్న మహిళ అనే వార్తలపై హోంమంత్రి అనిత స్పందించారు. దీనిపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశించారు. నెల్లూరు పోలీసుల అండతో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు సెటిల్మెంట్లు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలావుండగా, హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ కు పెరోల్ అంశంపైనా హోంమంత్రి ఆరా తీస్తున్నారు. పెరోల్ అంశంపై నివేదిక ఇవ్వాలని జైళ్లశాఖ డీజీకి హోంమంత్రి ఆదేశించారు.