Suryaa.co.in

Andhra Pradesh

రైతు సంక్షోభానికి, కన్నీళ్లకు కారణం ఎవరు…ఈ సైకో జగన్ కాదా ?

– జగన్ కు పిచ్చి ముదిరింది…ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది
• రైతులు చైతన్యవంతులై జగన్ పాలనపై తిరుగుబాటు చేయాలి
– ధాన్యం కొనకపోతే కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి కొంపకు పంపుతా
– గోనె సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా?
– కౌలు రైతును ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా
– తణుకులో రైతు పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
• ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
• దారి పొడవునా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు కష్టాలు చెప్పుకున్న ధాన్యం రైతులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు నేడు పాదయాత్ర చేశారు.ఇరగవరం నుంచి తణుకు వరకు జరిగిన పాదయాత్ర చూసి అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యత….సంక్షోభం వచ్చినప్పుడు స్పందిచేవాడే నాయకుడు. ఇంత వరకు ఎప్పుడూ జరగని నష్టం ఈ సారి అకాల వర్షాల కారణంగా జరిగింది.రైతులకు ఇంత నష్టం జరిగితే మొదట రావాల్సిన వ్యక్తి ఎవరు…ముఖ్యమంత్రి కాదా? మొద్దు నిద్రపోయే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే మూడురోజులపాటు పర్యటించాను. పంట మునిగింది పరిహారం ఇవ్వండి అని అడిగాం….ఇదేమన్నా గొంతెమ్మ కోరికా?

ఈ రోజు రైతు సంక్షోభానికి, కన్నీళ్లకు కారణం ఎవరు…ఈ సైకో జగన్ కాదా ?రైతులు చైతన్యవంతులై జగన్ పాలనపై తిరుగుబాటు చేయాలి… ప్రభుత్వం మెడలు వంచి న్యాయం పొందాలి. మొన్న కరోనా వస్తే….అన్ని కంపెనీలు మూసేశారు…కానీ పనిచేసింది ఒక్క రైతులు మాత్రమే.కరోనా సమయంలో రైతులు పంటలు పండించకపోతే ఈ సిఎం ఏమి తినేవాడు, వైసీపీ మంత్రులు ఏమి తినేవారు? దేశానికి అన్నం పెట్టే రైతుల కంట్లో జగన్ సున్నం కొడుతున్నారు. రైతుల సమస్యల పట్ల స్పందించలేని వ్యక్తికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? రైతుల కష్టాలపై 72 గంటల డెడ్ లైన్ ఇచ్చాము, ధాన్యం కొనకపోతే కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి కొంపకు పంపుతాను అని చెప్పాను.

మూడు రోజుల పాటు అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించాను. రైతుల కష్టాలు తెలుసుకున్నాను ఏప్రిల్ 1 వ తేదీన ప్రారంభించాల్సిన ధాన్యం కొనుగోలు ఎందుకు ప్రారంభం కాలేదు? గోనె సంచులు ఇవ్వలేదు…..అకాల వర్షాలపై కనీసం రైతులను హెచ్చరించలేదు. వర్షాల సమయంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. నేను మీ జిల్లాల్లో పర్యటనకు రాకపోతే మీకు కనీసం గోనె సంచులు కూడా ఇచ్చేవారు కాదు. రైతులకు సరైన గోనె సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా?గోనె సంచుల సరఫరాలో కూడా లంచాలు మెక్కి…..రంధ్రాలు పడ్డ గోనె సంచులిచ్చి రైతలు జేబులకు రంద్రాలు పెట్టారు.

మనం డెడ్ లైన్ ఇచ్చినట్లు 72 గంటలు దాటినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ నాపై మాటలతో దాడి చేస్తున్నారు.చివరికి రైతులను బెదిరించి నేను వెళ్లే మార్గంలో ధాన్యం లేకుండా చేస్తున్నారు.సొంత బాబాయిని చంపిన నేరస్తులకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఎక్కువ అప్పులు ఉండే రైతులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. ఒక్కో రైతుపై సరాసరి 2.74 లక్షల అప్పు ఉంది. ధాన్యం లో తేమ ఉన్నా, మొలక వచ్చినా కొంటాము అని ప్రకటన ఇచ్చారు. ఆ ధాన్యం కొన్నారా అని నేను అడుగుతున్నా.మనం పంట అమ్మితే మనకు డబ్బులు ఇవ్వాలి….కానీ విచిత్రమైన పరిస్థితి మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.

లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు.ఆర్బికె ల వల్ల రైతులకు ఏం లాభం వచ్చిందో చెప్పాలి. ఆర్ బికె కేంద్రాలు దగా కేంద్రాలు అయ్యాయి. ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడుగుతున్నా
అకాల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది….ఎంత మంది రైతులు నష్టపోయారు. 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు? విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి సాయం చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం ఈ అకాల వర్షాలకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోలేదు? ఏప్రిల్ 1 వ తేదీన రబీ ధాన్యం సేకరించాలి. కానీ ఎందుకు ధాన్యం సేకరణ చేపట్ట లేదు.? గోతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు…ఇది మీ చేతకానితనం కాదా?

రైస్ మిల్లర్లను దళారులుగా మార్చారు, వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కేజీ చక్కెర కొంటే కేజీనే ఇస్తారు….కానీ ఇక్కడ ధాన్యం సంచికి 40 కేజీలకు 42 కేజీలు ఎందుకు తీసుకుంటున్నారు? తేమ, తరుగు, నూక పేరుతో అదనంగా డబ్బులు గుంజుతున్నారు. దీని వల్ల బస్తాకు రూ. 200 నుంచి రూ. 300 పోతుంది. అంటే ఎకరానికి 10 వేల నుంచి 20 వేల నష్టం వస్తుంది. ప్రభుత్వం నాపై దాడి చేయడం కాదు. దీనికి సమాధానం చెప్పాలి చేతనైనే నాతో పోటీపడి రైతులకు సాయం చేయాలి కానీ నాపై విమర్శలు కాదు.నేటి ఈ పాదయాత్ర….వైసీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర అవుతుంది.రైతుల పంటలకు బీమా అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రభుత్వం బీమా కట్టడం లేదు. ఈ ముఖ్యమంత్రి లేచింది మొదలు చెప్పేది అసత్యాలే. ఈ సిఎం కళ్లార్పకుండా అబద్దాలు చెపుతాడు. ఒక్క బాబాయికేసులోనే ఎన్ని అబద్దాలు చెప్పాడో చూశాం.

ఈ సమావేశం ద్వారా అడుగుతున్నా రబీకి ఇన్ స్యూరెన్స్ కట్టారా…ఏ పొలంలో అయినా క్రాప్ కటింగ్ ఎక్సపరిమెంట్ జరిగిందా ?నాడు నష్టపరిహారం,…..ఇన్ స్యూరెన్స్ ఇచ్చి కష్ట సమయంలో రైతులను ఆదుకునే వాళ్లం.ప్రభుత్వం ధాన్యం సేకరణలో రైతుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రైతుకు తిరిగి ఇవ్వాలి.రవాణా ఖర్చులు, తరుగు, నూక పేరుతో వసూలు చేసిన మొత్తాలను రైతుకు చెల్లించాలి. జగన్ కు అర్థం కాకపోవచ్చు…కానీ నేర్చుకోవాలనే ఆలోచన లేదు.ధాన్యంమొత్తం ప్రభుత్వమే కొనాలి…కొన్న ధాన్యానికి వెంటనే మద్దతు ధర రైతుకు చెల్లించాలి. మీ డబ్బులు ఇప్పించడానికి నేను సిద్దంగా ఉన్నా…..రైతులు కూడా నాతో కలిసి పోరాటానికి కదలిరావాలి.

రైతాంగంలో ధైర్యం రావాలి…ఈ ప్రభుత్వం బెదిరిస్తుందని భయపడకండి. సమస్యలపై నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చింది.ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు…పోలీసులను పెట్టి రైతులను బెదిరించాడు, ఇలాంటి వాళ్లను నా జీవితంలో చాలా మందిని చూశాం. ప్రభుత్వం మనం మీటింగ్ లు పెట్టుకోకుండా తెచ్చిన జీవో నెంబర్ 1ను కోర్టు కోట్టేసింది. ఇది ప్రజా స్వామ్య విజయం.నేను మీటింగ్ లు పెట్టకూడదా మరి నాడు జగన్ రెడ్డి మీటింగ్ లు ఎక్కడ పెట్టాడు? జీవో నెంబర్ 1 తెచ్చి నేను అనపర్తికి పోతే…నా మీటింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాడు 9 కిలోమీటర్లు నడిచి…నల్ల చట్టాలను ధిక్కరించి మీటింగ్ లు పెట్టాం.జీవో నెంబర్ 1 పై సైకో ముఖ్యమంత్రి బుద్ది తెచ్చుకోవాలి.నేరస్తుడికి అధికారం ఇవ్వొద్దంటే నాడు మీరంతా వినలేదు, ఒక చాన్స్ అంటే కరిగిపోవద్దు అని నాడే చెప్పాను. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుంది….ఇప్పుడు అదే అయ్యింది.

విభజన తరువాత రెవెన్యూ లోటుతో పాలన ప్రారంభించాను. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా పాలన చేశాను.నాడు హుద్ హుద్ వస్తే అక్కడే ఉండి సాయం చేశాను. 2014 తరువాత వ్యవసాయంలో 11 శాతం వృద్ది రేటు సాధించాను.రుణమాఫీ కింద ఒకే సారి రూ.50 వేలు రైతుకు మాఫీ చేశాను. మనం అధికారంలో ఉండి ఉంటే 4, 5 విడతల రుణమాఫీ కూడ మీకు అందేవి.

ఈ ప్రభుత్వానికి నాలుగు డిమాండ్లు పెడుతున్నాను. దెబ్బతిన్న మొక్కజొన్న, జొన్న, వరికి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి. హార్టికల్చర్ పంటలకు ఎకరానికి రూ.50 వేలు ఇవ్వాలి. ఇన్ స్యూరెన్స్ కట్టలేదు కాబట్టి…నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు మనం పోరాడుదాం…ప్రభుత్వం అప్పటికీ ఇవ్వకపోతే…మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నష్టపరిహారం ఇస్తాం. ఈ జిల్లాలో పెద్దఎత్తున ఆక్వా కల్చర్ ఉంది. రాయలసీమలో హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాను. నాడు ఆక్వా కు యూనిట్ విద్యుత్ రెండు రూపాయలకు ఇచ్చే వాళ్లం…కానీ ఇతను వచ్చి రూ. 1.50 కు యూనిట్ విద్యుత్ ఇస్తాను అని చెప్పారు. ఇవ్వలేదు. రకరకాల నిబంధనలు పెట్టాడు.మనం వచ్చిన తరువాత ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్ అనే నిబంధనలు లేకుండా అందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇద్దాం.

ఇప్పుడు చుక్కల భూములు అంటున్నాడు….సర్వే అంటున్నాడు. ఈ విషయంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జగన్ కు పిచ్చి ముదిరింది…ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లింది.నేను రైతు వ్యతిరేకి అని జగన్ అంటున్నాడు…నేను 5 ఏళ్లు ఏం చేశానో….నువ్వు ఏం చేశావో చర్చకు సిద్దమా ?నాడు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇచ్చాం….యంత్రాలు ఇచ్చాం….రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం. రైతుకు అండగా నిలిచినపార్టీ టీడీపీ…రైతును నిండాముంచిన పార్టీ వైసీపీ. మళ్లీ జగన్ గెలిచేది లేదు…జగన్ పని అయిపోయింది. వ్యక్తులు, సంస్థలపై తప్పుడు కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం. ఈనాడులో వార్తలు రాస్తే మార్గదర్శిపై దాడి…..రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారు. తప్పుల్ని ప్రశ్నించిన వారిపై దాడి చేయడం తప్ప ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం లేదు.

పోలవరం పూర్తి చేసి ఉంటే రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. నాడు 72 శాతం పోలవరం పూర్తి చేశాం.టీడీపీ ఉండి ఉంటే రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగేది. రాష్ట్రం సుభిక్షం అయ్యేది. ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి పోలవరాన్ని నాశనం చేశాడు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలీదు.ఈ రాష్ట్రానికి ఏంటీ దరిద్రం అనేది అంతా ఆలోచించాలి. బటన్ నొక్కడం కాదు….జగన్ చేసేది…బొక్కటం. జగన్ అతని ఎమ్మెల్యేలు కలిసి దోచుకుంది రూ. 5 లక్షల కోట్లు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా లాంటి పథకాలు తీసివేసి…నేను వస్తే పథకాలు తీసేస్తా అని ప్రచారం చేస్తున్నాడు జగన్.

జగన్ రూ 10 లక్షల కోట్లు అప్పులు చేసి….ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలి అని చూస్తున్నాడు. సంక్షేమం మొదలు పెట్టిందే ఎన్టీఆర్…మనం వచ్చిన తరువాత అభివృద్ది చేస్తాం….రెట్టింపు సంక్షేమకార్యక్రమాలు చేస్తాం.అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం…పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ వల్ల సమాజంలో కొంత మార్పు వచ్చింది, పిపిపిపి అనే విధానం ద్వారా పేదల జీవితాలను మార్చుతా. పబ్లిక్, ప్రైవేట్, ప్రభుత్వ పార్టనర్ షిప్ తో మార్పు చేసి చూపిస్తామనది విశ్వసనీయత, జగన్ ది ఫేక్ న్యూస్. అవినీతికి చిరునామా 43 వేల కోట్ల అవినీతి అని సిబిఐ తేల్చింది. జగన్ అవినీతి చేసిన 43 వేల కోట్లు గ్రామాల్లో బూత్ లలో పంచితే బూత్ కు ఒక కోటీశ్వరుడు అవుతారు. జగన్ ఇప్పుడు 2 లక్షల అక్రమార్జన చేశాడు…ఆ డబ్బు పంచితే రెండు లక్షల మంది కోటీశ్వరులు అవుతారు.దేశంలో రిచ్చెస్ట్ సిఎం జగన్ రెడ్డి…..అతను ప్యాలెస్ లు, లక్షల కోట్లు పెట్టుకుని క్లాస్ వార్ అంటున్నాడు.

వచ్చేది క్లాష్ వార్ కాదు…అవినీతిపై వార్. జగన్, అతని ప్రభుత్వ దోపిడీ పై వార్ జరుగుతుంది.ఇసుక దొరకకపోవడం వల్ల 40 లక్షల కుటుంబాల వారు రోడ్డున పడ్డారు. మద్యపాననిషేదం అని చెప్పి…..మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తెచ్చాడు. అదీ జగన్ విశ్వసనీయత
మనం ఉన్నసమయంలో కరెంట్ చార్జీలు పెరగలేదు…ఇప్పుడు కరెంట్ చార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి. జగన్ పేదవాళ్ల కోసం పనిచేసే వ్యక్తి కాదు….జగన్ డబ్బుల పిచ్చోడు. దేశంలో అందరూ పేదవారిగా ఉండాలి…..కానీ జగన్ ఒక్కడే ధనికుడిగా ఉండాలి. అందుకే చెపుతున్నా….. ఐదుకోట్ల మందికి….ఈ సైకో జగన్ కుమధ్య జరిగే యుద్దం జరగబోతుంది.

రైతులకు న్యాయం చేయకపోతే ఈ ముఖ్యమంత్రిని నిలదీద్దాం. అవసరం అయితే తాడేపల్లి వెళదాం. రైతుల తరుపున నేను చేసిన నాలుగు డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలి. వారం రోజుల్లో ప్రభుత్వం మా డిమాండ్లు తీర్చాలి. లేదంటే అప్పుడు తదుపరి పోరాటం చేస్తాం. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు…అతను ఎర్రిపప్ప. అంటే అర్థం బుజ్జినాన్న. ఇతను వెర్రిపప్పా…బుజ్జినాన్నా? మా అచ్చెన్న చెప్పినట్లు మొదటి ఎర్రిపప్ప తాడేపల్లిలో ఉన్నాడు…రెండో వెర్రిపప్ప ఇక్కడ ఉన్నాడు రైతులపై ప్రేమ ఉంటే వెంటనే జగన్ మంత్రి కారుమూరిని మంత్రిపదవి నుంచి తొలగించాలి మంత్రిగా ఉండి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనలేని మంత్రి మనపై విమర్శలుచేస్తున్నాడు.

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా….ఈ మంత్రులు నన్ను బెదిరిస్తారా?ఈ మంత్రి అనుకుంటే నేను తణుకు దాటనా……తీవ్ర వాదులతో పోరాడిన పార్టీ టీడీపీ. ఆకు రౌడీలకు భయపడతానా? రౌడీయిజం చేస్తున్న వైసీపీ నేతల తప్పులు అన్నీ లెక్క పెడుతున్నా…అన్నిటికీ బదులిస్తా. ఈ రోజు సభ నుంచి చెపుతున్నా…కౌలు రైతును ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా.

LEAVE A RESPONSE