– అసలు కసబ్ కాంగ్రెస్ పార్టీ కదా
– కృష్ణా నీళ్లను చంద్రబాబుకు గురుదక్షణ ఇవ్వాలని చూసింది మీ ప్రభుత్వం కాదా?
– తెలంగాణ లో బేసిన్లు తెలియవు
– సాగునీటిపై బేసిక్స్ తెలియవు
– ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన అసలు కసబ్ కాంగ్రెస్ పార్టీ కదా!
మరి ఎవరిని ఉరి తీయాలి ? తెలంగాణకు ఎవరు అసలైనా కసబ్ లు ? ముఖ్య మంత్రి గారు? తెలంగాణకు ఎవరు అసలైనా కసబ్ లు ? ముఖ్య మంత్రి గారు?తెలంగాణ నీళ్లను ఆంధ్ర రాష్ట్రానికి దారదత్తం చేయాలని చూస్తున్న మీ ప్రభుత్వ సలహాదారుల నా? అవగాహనా లేకుండా అనుమతులు ఇస్తున్న మీ మంత్రినా?
గోదావరి నీళ్లను గోదావరి బనకచర్లతో గురువు చంద్రబాబు కు అప్పజెప్తే ,దాన్ని హరీశ్ రావు ప్రశ్నిస్తే తోక ముడిచి నల్లమల బనకచర్ల తో మళ్ళీ జల ద్రోహనికి పాల్పడుతున్నది మీ ప్రభుత్వం.
కృష్ణా నీళ్లను చంద్రబాబుకు గురుదక్షణ ఇవ్వాలని చూసింది మీ ప్రభుత్వం కాదా? తెలంగాణ లో బేసిన్లు తెలియవు. సాగునీటిపై బేసిక్స్ తెలియవు. ప్రాజెక్ట్ లపై అవగాహనా లేని ఇరిగేషన్ మంత్రి , నా? ఎవరిని ఉరి తీయాలి ? తెలంగాణ నీళ్ల విషయం లో ఆపద వచ్చిన ప్రతిసారి గర్జిస్తున్నది కేసీఆర్, హరీశ్ రావు మాత్రమే అన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు.
ముఖ్యమంత్రి అయి ఉండి నీళ్లపై అవగాహన లేక కోచింగ్ క్లాస్ లు తీస్కుంటున్న నువ్వు.. తెలంగాణా నీళ్లను కాపాడుకునేందుకు నిత్యం పోరు చేస్తున్న కేసీఆర్, హరీశ్ రావు లపై విమర్శలు చేయడం నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం కాదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి తాకట్టు పెడుతున్న ప్రభుత్వం మీది కాదా?
ఈ ప్రాంత హక్కులపై కెసిఆర్, హరీశ్ రావు నిలదీస్తే నీ బండారం బయటపడేసరికి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను పక్క దారి పట్టిస్తున్నది నిజం కాదా? ఉరి తీయాల్సి వస్తే ముందుతీయాల్సింది కాంగ్రెస్ పార్టీ ని కద? ఈ ప్రాంత రైతాంగం నడ్డి విరుస్తున్న నిజమైన కసబ్ ప్రభుత్వం మీది కద? 6 గ్యారెంటీలు ఎగవేట్టిన అసలు కసబ్ లు కాగ్రెస్ కాదా? ముఖ్యమంత్రి గా ఉండి ఈ ప్రాంత నీళ్లను కాపాడక పోగా, నీళ్ల హక్కుల కోసం కొట్లాడుతున్న కేసీఆర్,హరీశ్ రావును నీచపు విమర్శలు చేయటం సిగ్గుచేటు.
అభివృద్ధి చేయలేక ఏం మాట్లాడాలో అర్ధం కాక బూతులనే నమ్ముకున్న ముఖ్య మంత్రి కి తెలంగాణ రైతాంగం బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మన తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కి ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైంది. తెలంగాణ జల దోపిడీపై BRS పోరాడుతుంటే, తమ బండారం బయట పడుతుందనే అక్కసుతో నోటికి ఏదీ వస్తే అది మాట్లాడుతున్న తెలంగాణ జలద్రోహి కుట్రలను తెలంగాణా సమాజం, తెలంగాణ రైతాంగం గ్రహింస్తుంది
కెసిఆర్ హరీశ్ రావుపై అవాకులు చేవాకులు పేలితే జనం హర్షిస్తరనుకుంటే అది మీ మూర్ఖత్వమే. నీకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పే సమయం దగ్గర్లోనే ఉంది. కెసిఆర్ హరీష్ రావుపై చిల్లర కూతలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.