Suryaa.co.in

Andhra Pradesh

హిందూ పేర్లు మార్చి ముస్లిం పేర్లు ఎందుకు పెడుతున్నారు?

– ఏటీ అగ్రహారం పేరు మార్చి ఫాతిమా నగర్‌ ఎలా పెడతారు?
– పేర్లు మారుస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా
– గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల ఫైర్‌

గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారం లోని 2వ లైన్ ను ఫాతిమా నగర్ అని పేరు మార్చి హిందువుల మనోభావాలను గాయపరుస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. గుంటూరు నగరంలో అనేక వీధులకు అక్కడ అంతకుముందే ఉన్న పేర్లను తీసివేసి ముస్లింల పేరు పెట్టడం తగదని అన్నారు.ఎందుకు ఈ విధంగా మీరు ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నారు అర్థం కావటం లేదు. అన్ని మతాలవారు ఓట్లు వేస్తేనే ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు. అటువంటిది మెజార్టీ ప్రజలు హిందువులైన వారి పేర్లను తీసివేసి ఈవిధంగా ఇంకొక మతానికి సంబంధించి పేర్లు పెట్టడం అనేది తగదని అన్నారు.

అలాగే గతంలో జిన్నా టవర్ రోడ్డును వీర సావర్కర్ అని నామకరణం చేశారు. కానీ ఇంతవరకు వాటిని పట్టించుకున్న దాఖలు లేవు ఆరోడ్డును వీర సావర్కర్ అని పూర్తిగా నామకరణం చేసే దమ్ము ధైర్యం ఈప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నాం. అంతేగాని ఒక మతం పేరు తీసి ఇంకో మతం పేర్లు పెట్టి ఏంచేద్దాం అనుకుంటున్నారు.మీరు ఇటువంటి రాజకీయాల్ని ప్రోత్సహిస్తుంటే భారతీయ జనతాపార్టీ చూస్తూ ఊరుకోదు.

రానున్న రోజుల్లో వీటన్నిటికీ మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు తప్పక వస్తుంది. అనంతరం డిప్యూటీ సిటీ ప్లానింగ్ అధికారి కోటయ్య ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడుతూ అధికారులు ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయో లేదో చూసి మీరు ఆవిధంగా వెళ్లాలి గాని ఈ రాజకీయాల్లో ఎందుకు మీరు పాలు పంచుకుంటున్నారు. వైసిపి తీసుకున్న నిర్ణయాలతో మీరు పావులుగా మారద్దని వారికి సూచించి చెప్పడం జరిగింది.

ఏటి అగ్రహారం రెండో లైను పేరును ఫాతిమా నగర్ గా పేరు మార్చిన సందర్భంలో ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నవారు రాచుమల్లు భాస్కర్, అప్పిశెట్టి రంగా, కుమార్ గౌడ్, వనమా నరేంద్ర, దారా అంబేద్కర్, ఈదర శ్రీనివాసరెడ్డి, రఫీ, కొక్కెర శ్రీనివాస్, అనిల్, పద్మనాభం, కారం శెట్టి రమేష్, తాడువాయి రామకృష్ణ, రాజేష్ నాయుడు, అంకాల శ్రీనివాస్, దరిసపు శ్రీనివాస్, కామేపల్లి వెంకటేశ్వర్లు, విస్తారక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE