హిందువులు ఒక పండుగను ఉత్సవంలా జరుపుకోవడం కోసం సుప్రీంకోర్టు వరకు పోరాడాల్సిన దుస్థితి ఎందుకు?
దక్షిణాదిన దసరా అంటే మైసూరు సంబరాలు. దేశ విదేశాల నుండి వస్తుంటారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉంది. నవరాత్రులు లక్షలాదిమంది భక్తుల మధ్య జరుగుతుంది. విజయవాడలో మతాలకు అతీతంగా దసరా మామూలు అడుగుతుంటారు.
మైసూరు ఉత్సవాల లెక్కన ఉత్సాహంగా దక్షిణాది సాంస్కృతిక, సాంప్రదాయ రాజధానిగా అమరావతి కృష్ణానది ఒడ్డున వైబ్రంట్ విజయవాడ ఉత్సవ్ జరిపి ప్రజల్లో పండుగ ఆనందాన్ని చూడాలని అనుకొన్నారు.
కానీ రాక్షస వైకాపాకు జనం ఆనందిస్తే తట్టుకోలేదు. సైకో పార్టీగా.. జనం కాల్చి వాతపెట్టినా.. భూతంలా దసరా పండుగ మీద దాని దుష్ట కన్ను పెట్టింది.
దసరా, దక్షిణ భారతదేశంలో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ముఖ్యంగా విజయవాడలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఈ పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. అజ్ఞానంపై జ్ఞానం, అంధకారంపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పది రోజుల ఉత్సవాలు జరుగుతాయి.
ఈ సంస్కృతి, ఆధ్యాత్మికతకు అనుగుణంగా, విజయవాడను దక్షిణ భారతదేశ సాంస్కృతిక రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘వైబ్రంట్ విజయవాడ ఉత్సవ్’కు ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
దేవాలయ భూముల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, నిర్వాహకులు మరియు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివాదానికి దారితీసిన అంశాలు!
ఈ వివాదం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన గొల్లపూడిలోని 35-40 ఎకరాల భూమి చుట్టూ తిరిగింది. ఈ భూమిని వైబ్రంట్ విజయవాడ ఉత్సవం కోసం వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ కొందరు (వైకాపా వారే) పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయ ప్రక్రియలో కీలక మలుపులు
హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు: తొలుత ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, దేవాలయ భూములను కేవలం మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని స్పష్టం చేస్తూ, అధికారులు ఆ భూముల్లో వేసిన గ్రావెల్, మట్టి, కంకరలను తొలగించి, భూమిని యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు: ఈ ఆదేశాలపై వైబ్రంట్ విజయవాడ సొసైటీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఉత్సవాల నిర్వహణకు తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నామని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సొసైటీ తరఫున వాదించిన న్యాయవాదులు, ఈ భూమిని కేవలం 56 రోజుల లీజుకు తీసుకుంటున్నామని, దీనికి గాను దేవాలయానికి ₹45 లక్షలు చెల్లిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇది దేవాలయానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని వివరించారు.
అక్కడితో వైకాపా ఆగలేదు!!
సుప్రీంకోర్టు తుది తీర్పు: ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనితో పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
ఉత్సవాల వివరాలు
ఈ తీర్పుపై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ ఎగ్జిబిషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 24 నుంచి ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ఉత్సవాలను విజయవాడతో పాటు ఏడు నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం ద్వారా విజయవాడను దక్షిణ భారతదేశానికి సాంస్కృతిక రాజధానిగా నిలబెట్టాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ 11 రోజుల ఉత్సవంలో 286 ఈవెంట్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అగ్రి ఎక్స్ పో, కూచిపూడి, భరత నాట్యం, డ్రోన్ షోలు, ఫుడ్ స్టాల్స్ వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.