– 96 కోట్ల విలువైన భూమి 2.40 కోట్లకు ప్రైవేటు స్పోర్ట్స్ సంస్థలకు అప్పగింత
– ప్రైవేటు స్పోర్ట్స్ సంస్థల సేవలు ఉచితమా? వ్యాపారమా?
– వ్యాపారమైతే వారికి అంత తక్కువ రేటులో భూములివ్వడం అసమంజసమే
– ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ ధరలు అసమంజసం
96 కోట్ల విలువైన భూమి 2.40 కోట్లకు ప్రైవేటు స్పోర్ట్స్ సంస్థలకు అప్పగింత
రాజధానిలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం నాలుగు కోట్లకు కేటాయించారు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు ఎకరా 10 లక్షలకు ఫ్రీ హోల్డ్ పద్ధతిలో ఇచ్చారు. బిజెపి పార్టీ కార్యాలయానికి ఎకరా వెయ్యి రూపాయల అద్దె కింద 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు.
ముఖ్యంగా సిబిఐ కి గతంలో మూడున్నర ఎకరాలు కేటాయించి దాన్ని రెండు ఎకరాలకు అది కూడా ఎకరా నాలుగు కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. జూలాజికల్ ఇండియా గతంలో ఎకరా కేటాయించి ఇప్పుడు రెండు ఎకరాలు ఇచ్చారు దీనికి కూడా ఎకరా కోటి రూపాయలు ధర నిర్ణయించి 60 సంవత్సరాల లీజు ప్రకటించారు.ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఆఫ్ ఇండియా కు 5 ఎకరాలు కేటాయించారు.
ఆప్కాబ్ కు 49 సెంట్లు ఎకరా రెండు కోట్లు ధర చొప్పున కేటాయించారు.ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు రెండు ఎకరాలు ఎకరా నాలుగు కోట్లు ఏపీ గ్రామీణ బ్యాంకుకు రెండు ఎకరాలు ఎకరా నాలుగు కోట్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 సెంట్లు ఎస్ఐబికి 50 సెంట్లు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు 50 సెంట్లు కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు ఎకరా 50 లక్షలు చొప్పున 60 సంవత్సరాల లీజు నిర్ణయించారు. బిజెపి పార్టీ ఆఫీసుకు రెండెకరాలు ఎకరా లీజు ₹1000 ఏడాదికి చొప్పున కేటాయించారు.
వారిపై ఎందుకంత ప్రేమ?
ఇక పుల్లెల గోపీచంద్ బ్యాట్మెంటన్ అకాడమీ, ఎమ్ ఎస్ కె ప్రసాద్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు చొప్పున ఎకరా 10 లక్షలకు ఫ్రీ హోల్డ్ పద్ధతిలో కేటాయించారు. అంటే 24 ఎకరాలు వారికే వెళ్లాయి. అంటే ఇప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 96 కోట్ల విలువైన భూమి వారికీ 2.40 కోట్లకు అప్పనంగా అప్పగించారు. మరి వాళ్ళు ఉచిత సేవ చేస్తారా? వ్యాపారం చేస్తారా? అనేది జిఓలో ప్రభుత్వం పేర్కొనలేదు.
ఎందుకు ఈ తేడా?
ఈ కేటాయింపుల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన భూములకు ఎక్కువ ధరను, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములకు తక్కువ ధరను నిర్ణయించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది
(రాజధాని భూ కేటాయింపుల్లో కొన్ని అంశాలపై నా పరిశీలన)
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208