– మీరు పిరికివాళ్లు.. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు
– జగన్ పై ఏం చర్యలు తీసుకున్నారు ?
– ఐదేళ్లలో జరిగిన వాటికి.. అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు?
– మీరు ఇవన్నీ చేయనప్పుడు.. అమరావతి రైతులని ఆదుకుంటారని ఎట్లా నమ్మాలి?
– మీకు అమరావతి రైతులు పూలింగ్ కోసం గుర్తుకొచ్చారా?
– రాజకీయంగా పుట్టుకతో నేరస్తుడు జగన్
– నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయకపోవడం మన తప్పు
– అదే తప్పు ఇవాళ మళ్లీ 2024 నుంచి కూడా చేస్తున్నాం
– జగన్ చేసిన అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు
– జగన్ ను శిక్షించక పోతే అది ప్రభుత్వం తప్పు
– జగన్ ఒక పాము.. వదిలే స్తే రాష్ట్రం మొత్తం పాకుతాడు
– 29 గ్రామా లు ఒక తాటి మీదకు రాలేనప్పుడు.. 13 జిల్లాల వాళ్ళు మీతో ఎందుకు వస్తారు?
– రెండో విడత భూ సమీకరణ ఎందుకో రైతులూ అడగాలి
– రాష్ర్టాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
– జగన్, కూటమి ప్రభుత్వ వైఫల్యం పై మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసి కూటమి ప్రభుత్వం భయంతో వణికిపోతోందని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిరికితనంతో పాము లాంటి జగన్‌ను విడిచిపెట్టి.. అది రాష్ట్రం మొత్తం పాకేలా చేసి, రాష్ర్టాన్ని అధోగతి పాలు చేయవద్దని కన్నెర్ర చేశారు. జగన్ జమానాలో దొంగలెవరో, దోపిడీ దారులెవరో, అమరావతి రైతులను వేధించిన వారెవరో మీకు తెలియదా? మరి వారిపై ఈ రెండేళ్లలో ఎందుకు చర్యలు తీసుకోరని సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో రెండోవిడత భూ సమీకరణ ఎందుకో రైతులు ప్రభుత్వాన్ని అడగాలని.. ప్రభుత్వం కూడా ఏ కారణాలతో రైతుల నుంచి భూసమీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి అమరావతి రైతులు ఏడాది వరకూ గుర్తు రాలేదు.
ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కోసం వాళ్లు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌కు మానసిక వ్యాధి ఉందని, అందుకే పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్ చేసిన దౌర్జన్యాలను ప్రశ్నించకపోతే ప్రజలది ఎంత తప్పో.. జగన్‌ను శిక్షించకపోవడం ప్రభుత్వానిదీ అంతే తప్పవుతుందని కుండబద్దలు కొట్టారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని, అసలు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత జోన్ల ప్రస్తావన అనవసరం అని స్పష్టం చేశారు.
అమరావతిలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్. ఆయన మాట్లాడే దాంట్లో ఏనాడు సెన్స్ ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెన్స్ ఏమీ లేదు.. అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి, అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురు మొహం పెట్టుకొని.. మేము దీనికి అడ్డుపడదలుచుకోలేదు. మేము దీన్ని అంగీకరిస్తున్నాం అని చెప్పింది ఈయన.
ఆ రోజున ఆయన మొఖం చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో. ఆ తర్వాత అమరావతి రైతులకు చాలా అనుభవాలయ్యాయి. అమరావతి రైతులందరూ కలిసి సెక్రటేరియట్ దగ్గర భోజనాలకు పిలిస్తే నేను రాను పొమ్మన్నాడు. అమరావతి శంకు స్థాపనకి అక్టోబర్‌లో 2015లో జరిగింది.
ఇద్దరు మంత్రులు ఆయన ఇంటికి వెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే.. అసలు వాళ్ళు వెళ్ళే లోపలే ఈయన ఉత్తరం రాస్తాడు. నాకు ఇన్విటేషన్ ఇవ్వవద్దు అంటాడు. ఏం మాయరోగం వచ్చింది? నువ్వు శాసన సభలో ఒప్పుకున్న రాజధానికి శంకు స్థాపన చేస్తా అంటే, రావటానికి నీకు ఏం వచ్చింది?
ఇన్విటేషన్ కూడా తీసుకునే మర్యాద కూడా లేని కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున రాలా. భోజనాలు పిలిస్తే రాలా. ఆ రోజునే అమరావతి రైతులకు అతని గురించి తెలుసుకొని ఉండాలి. ఆ రోజునే అతను ఏంటా అన్నది అమరావతి రైతులు అర్థం చేసుకుని ఉండాలి. తాడికొండ నియోజక వర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉండాలి. ఏ పిచ్చిలో పడి, ఏ భ్రమలో పడి ఓట్లు వేశారు మీరు? అదే అతనికి ధైర్యం ఇచ్చింది. నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యం ఇచ్చింది. దాని పర్యవసానమే 19 నుంచి 24 వరకు మీరు అనుభవించిన నరకం.
జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలీదు కానీ.. ఈ రాష్ట్రంలో చాలామంది ప్రజలకి, కీన్ గా అబ్సర్వ్ చేసే వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. ఆయన రాజకీయ జననమే ఒక నేరంలోంచి పుట్టింది. ఆయన రాజకీయంగా పుట్టుకతో నేరస్తుడు. అవినీతి డబ్బు దొంగతనం దాన్ని తప్పుడు మార్గాల్లో పెట్టుబడి పెట్టి, తప్పుడు కంపెనీలు పెట్టడం.. ఇక్కడి నుంచి పుట్టింది ఆయన రాజకీయం. మనకు తెలీదా?!
2014 లో ఎలక్షన్లు అయిన నాటికే తెలుసు అతని రాజకీయం ఏంటో. 2014 నుంచి 19 వరకు అతని నేర స్వభావాన్ని, అతని నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయకపోవడం మన తప్పు. అదే తప్పు ఇవాళ మళ్లీ 2024 నుంచి కూడా చేస్తున్నాం దీనికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పాము ని చంపడానికి భయపడితే, అది రాష్ట్రం అంతా పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి గాని, ఆయన రాజకీయ పద్ధతి గురించి గాని ఎవ్వరికీ మొదటి నుంచి ఏ డౌట్లు లేవు. అమాయకంగా కళ్ళు మూసుకొని కూర్చున్నవాళ్ళు మోసపోయారు.
కళ్ళు తెరిచిన వాళ్లెవరూ మోసపోలేదు. జగన్మోహన్ రెడ్డి కి ఎట్లా వచ్చిందో, పుట్టుక నుంచి ఉందో, తర్వాత వచ్చిందో తెలియదు కానీ.. ఆయనకు ఒక వింత మానసిక వ్యాధి ఉంది. ఆయనని ఊరికే అంటలే సైకో అని. ఆయనకు నా ఉద్దేశంలో స్కిజోఫ్రీనియా అని ఒక రోగం ఉంది. మానసిక జంపు స్కిజోఫ్రీనియా మీన్స్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఆఫ్ సేనిటీ అండ్ ఇన్సేనిటీ అంటారు..
అంటే కొద్ది రోజులు బాగుండటం, కొద్ది రోజులు బాగోకపోవడం. మానసికంగా ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సైకాటిక్ డిసార్డర్. కొన్ని రోజులు బాగుంటాడు. బాగున్నప్పుడు వెళ్లి బెంగళూరులో కూర్చుంటాడు. మళ్లా ఆ పిచ్చి తలకెక్కంగానే ఇక్కడికి వచ్చి, ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం. అప్పుడు కూడా ఇదే పద్ధతి. పిచ్చి వేసినప్పుడల్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. నోటికి వచ్చింది వాగిపోవడం. ఆ తర్వాత ఏం చేసుకునేవాడో మనకు తెలిసేది కాదు. దట్ మే బి హిస్సన్ సైకిల్. ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడో.. ఏం చేసేవాడో మనకు తెలియదు కాబట్టి.. ఆయనకు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది అండ్ హి హస్ డెల్యూషన్ ఆఫ్ గ్రాండ్యూర్ డెల్యూషన్స్ ఆఫ్ పారనయ కూడా. అందుకే దేని గురించో భయపడిపోతా ఉంటాడు.
లేకపోతే ఎవడైనా ముఖ్యమంత్రి అనేవాడు పచ్చ ని చెట్లు కొట్టిస్తాడండి ఎక్కడైనా? విజిట్ కి వెళ్తే మీరు ఎక్కడైనా విన్నారా మనుషులు ఇట్లా చేయడం? రోడ్ వెంట వెళ్తుంటే పరదాలు కట్టుకుంటారా? ఆయనకి ఏదో పిచ్చి, భయం ఉంది. ఎవరి నుంచో తను చేసిన పాపాలు తనను వెంటాడతాయి అన్న భయమో ఏమో గానీ.. అది మామూలు భయం కాదు.
మామూలుగా అందరూ సెక్యూరిటీ పెట్టుకుంటారు అది ఓకే. ఇది ఏదో తెలియని భయంగా బతికేవాళ్ళు కాబట్టి, ఆయన నుంచి మామూలు ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన పిచ్చి, మన భ్రమ. ఆయన ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషం, కక్ష ఆయన జన్మలో పోదు. ఆయనేం మారడు. ఆయన అంతే. అది అంతే.
మనం ఏం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలను, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలను అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుతుంది. దాన్ని శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. . ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది.. అమరావతి రైతుల్ని భయపెట్టడంతో పాటు, రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదాం అని అనుకుంటున్నాడు.
మనం భయపడ్డామా.. చచ్చినట్టే! భయపడకుండా ఎదురు తిరిగితే తప్ప, ఇటువంటి మృగాలని తరిమికొట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే ఏదో రూపంలో దూరతాయి. మనం బలహీనత చూపించామా .. మనని వేటాడుకొని తింటాయి అని గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రైతులు ఒక్కరేకాదు. ఈ విషయం స్పష్టంగా చెప్తున్నాను.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి ని చూసి ప్రభుత్వం భయపడుతుంది. జగన్మోహన్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఐదేళ్లలో జరిగిన వాటికి, అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్ళతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకొని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కేబుల్ విద్యుత్ ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు?
మీకు తెలియదా జరిగిన విషయం ఎవరు చేశారో? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగల్ని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనికి ధైర్యం? మీరు పిరికివాళ్లు కాబట్టి, మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు. అమరావతి రైతులు బండ్లు కట్టుకొని తిరుపతి పోతా ఉంటే.. తినే అన్నంలో ఇ సకపోసిన దుర్మార్గులు వీళ్ళు.
అటు శ్రీకాకుళం పోతా ఉంటే.. రాజమండ్రిలో సోడా బాటిల్, రాళ్ళు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలియదా? అవన్నీ రికార్డు మీదే ఉన్నాయిగా? వీడియోలు ఉన్నాయి. సాక్షాలు ఉన్నాయి. ఆ రోజున పేపర్లో వచ్చినయి. అన్ని ఉన్నాయి. ఎందుకు మీరు ఆ కేసులు లేదు? ఆ రోజున అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టల? ఇప్పుడు మీరెందుకు పెట్టరు?
మీరు ఇవన్నీ చేయనప్పుడు, అమరావతి రైతులని మీరు ఆదుకుంటారని చెప్పి ఎట్లా నమ్మాలి? సంవత్సరంన్నర పాటు అమరావతి రైతులు మీకు ఏం గుర్తు రాలా? మీకు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అవసరమైన నాడు అమరావతి రైతులని కూర్చోబెట్టి, కేంద్రమంత్రి చంద్రశేఖర్ ని పంపించి బుజ్జగించడానికి ట్రై చేస్తారా? ఒక జగన్మోహన్ రెడ్డి కాదు. అందరి పట్ల అమరావతి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఎవరు ఏమిటో అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. . అమరావతి రైతులు వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాలంటే, వాళ్ళు సంఘటితంగా నుంచుంటే తప్ప ఇది జరగదు. ఎవరికివారు నాకెందుకులే అని ఇంట్లో పడుకుంటే.. మిగిలిన రాష్ట్రానికి మట్టుకు.. మీకెందుకు? మీరు ఎట్లా చెప్తే వాళ్ళ కు ఎందుకు? మీరు ఉన్న 29 గ్రామాల ఒక తాటి మీదకు రాలేనప్పుడు.. 13 జిల్లాల వాళ్ళు మీతో పాటు ఎందుకు వస్తారు? కాబట్టి ఆలోచించుకోండి. అమరావతి రైతులు కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండండి. ఎవరు ఏం చేస్తున్నారు.అని!
అమరావతి నిర్మాణంలో ఏమాత్రం తప్పులు జరిగినా వెంటనే గళవెత్తి ప్రశ్నించాల్సిన బాధ్యత మీది. లేకపోతే దాన్ని ఎవరూ ఆపలేరు. అమరావతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి గుండెకాయ లాంటిది. అక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా, అమరావతి చాలా ఇంపార్టెంట్.
ఈ అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి.. అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునేదానికి వీలుగా, దీన్ని దీన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సిన అవసరం ఉంది . అంతకుముందు కూడా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
దీన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించి.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
రెండో విడత భూ సమీకరణ మీద నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే. ఆ 20,000 ఎకరాలో లేక, మూడో విడత ఏం చేయబోతున్నారో మీరు చెప్పండి. మీరు అమరావతి ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళని పిలుస్తున్నామండి. మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు అన్నారు. రైతులందరూ నమ్మారు. మీకు ఇచ్చారు.
అలాగే రెండో విడత, మూడో విడతలో కూడా ఏం చేయబోతున్నారో ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. దాన్ని ఎలా కడతారో, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో చెప్పండి. దాని నుంచి రెవెన్యూ ఎట్లా వస్తుందో చెప్పండి. ఏ ఏ అవసరాలకు ఉపయోగిస్తారో చెప్పండి.
ఏవి చెప్పకుండా రైతుల దగ్గర రేపు భూమి తీసుకుంటే, మీరు ఆ రైతులకు బాధ్యత పడాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం కాబట్టి, ఇది అమరావతి రైతులకు, కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు. రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. కాబట్టి మీరు పారదర్శకతతో వ్యవహరించమని చెప్పి, ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
రైతులను కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని అడిగి, వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోండి.. లేకపోతే ఊరికే మొదటి విడతలో రైతులు ఇచ్చారు కదా అని చెప్పి, రెండో విడతలో వాళ్ళు గుడ్డిగా ఇవ్వకండి. అడిగి తెలుసుకోండి. దాని ప్లాన్ ఏంటో తెలుసుకోండి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోండి.