– ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు ఒక బావి చూసి దూకాలి
– ఇప్పటి మీ చర్యలకు రేపు రెండింతలతో బదులు
– వేధిస్తున్న అధికారుల పద్ధతి కూడా మారాలి
– తప్పుడు పనులు చేసిన వారెవ్వరినీ వదలిపెట్టం
– సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం
– ఎక్కడ ఉన్నా తీసుకొస్తాం. చట్టం ముందు నిలబెడతాం
– నా పార్టీ వారిని నేను కలవడం తప్పా? నేరమా?
– వేల సంఖ్యలో పోలీసులు. ఎక్కడిక్కడ బారికేడ్లు
– అసలు నన్ను చూసి ఎందుకంత భయపడుతున్నారు?
– ప్రజాస్వామ్యంలో రాజకీయంగా స్టేట్మెంట్స్ కామన్
– చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారు
– అవే రేపు వృక్షాలవుతాయి.. అప్పుడు ఇదే కొనసాగుతుంది
– మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక
నెల్లూరు: రాష్ట్రంలో ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారని, దాని వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఇప్పుడు విషబీజాలు నాటుతున్నారన్న ఆయన, అవే రేపు వృక్షాలవుతాయని, అప్పుడు సరిగ్గా ఇదే కొనసాగుతుందని వెల్లడించారు. ఇది ఒక తప్పుడు సంప్రదాయం అని, దీన్ని చంద్రబాబునాయుడు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు.
నెల్లూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత నగరంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. వారి ఇంటిపై జరిగిన దారుణ దాడి వివరాలు తెలుసుకున్న ఆయన, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. నా పర్యటనలో ఎందుకీ ఆంక్షలు పెట్టారు? ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? వాళ్లను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందుల నుంచి టూవీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు.
నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు ఒక బావి చూసి దూకాలి. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఇంతగా భయపడి, ఆయన వస్తుంటే అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికి దక్కుతుంది.
వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యాదీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్లు విద్యాదీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు.
నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఆనాడు ఇవ్వగా, ఈరోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియమ్ ఆగిపోయింది. టోఫెల్ క్లాసులు ఎత్తేశారు.
ఆరోగ్యశ్రీ సేవలు నిల్చిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు.
చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడు అని చెప్పడానికి నెల్లూరులో జరిగిన రెండు ఉదంతాలు చెబుతాను. నా పక్కన ప్రసన్న అన్న (నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి) ఉన్నాడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న అన్నను. గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు. అటు, ఇటు రెండువైపులా ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే, ఇటు వైపు ఉన్న వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తాం.
కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80 మందిని ఇంటి మీదకు పంపించారు. వారు తాగి ఉండి రాడ్లతోనూ, కర్రలతోనూ దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంటిని మొత్తం నాశనం చేశారు. ఇంట్లో ప్రసన్న అమ్మ 83 ఏళ్ల ఆమె ఉంది. ఆమె మహిళ కాదా? ఆవిడను బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.
నేను అడగుతున్నాను. మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు ఈ మాదిరిగానే మా వాళ్లను కూడా పంపించి దాడి చేయించే కార్యక్రమం మొదలుపెడితే, రేపు పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా?.
నా పక్కనే ఉన్న గోవర్థన్ అన్న కూతురు. ఏం తప్పు చేశాడని గోవర్థన్ అన్నను జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరోకేసు పెడుతున్నారు. ఆయనను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి.
ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్డాడు. ఆయన ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వర్ట్ చేస్తే, అది కేసు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వర్డ్ చేశాడని మరో కేసు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ, ఉచితంగా ఎక్కడిస్తున్నారు?
ఇదే నెల్లూరు జిలాలో సివి క్రాంత్రెడ్డినథేచ్చగా దోచుకుంటున్నారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేష్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మైన్స్‌లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి.
ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు.
వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు ఇంత డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ప్రొడక్షన్ ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం పొలం కట్టబెడుతున్నారు. మరోవైపు సూపర్ సిక్స్, సూపర్‌సెవెన్ గాలికి వెగిరిపోయాయి.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్ని సంవత్సరాల తరువాత ఆయన కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలోని విషం, రాక్షసత్వం ఎంత ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం.
మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది
అయ్యా చంద్రబాబు.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తరువాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇదే చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన తప్పుడు అధికారులకు, ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్క జమ తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రేపు పొద్దున రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.
ఎవ్వరినీ వదలం. చట్టం ముందు నిలబెడతాం
ఇప్పటికైనా చంద్రబాబు మేలుకో. ఇప్పటికైనా తెలుసుకో అని చెబుతున్నా.. అలాగే మీ శాడిజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులు ఒత్తే అధికారులందరికీ చెబుతున్నాను.
కొంత మంది అధికారులు అనుకోవచ్చు.. మేం రిటైర్ అవుతాం. లేదా వీఆర్ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. అలాంటి వారందరికీ చెబుతున్నా. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. రిటైర్ అయినా, వీఆర్ఎస్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరినీ పిలపించి, మీరు చేసిన ప్రతి పనికి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడుతాయి’ అని వైయస్ జగన్ హెచ్చరించారు.