• మార్గదర్శి సంస్థ అక్రమాలకు పాల్పడి, డిపాజిటర్లను మోసగిస్తే, దానికి సంబంధించిన ఆధారాలను ఉండవల్లి, జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఎందుకు ఉంచడంలేదు?
• 2007లో అప్పటిప్రభుత్వం మార్గదర్శిపై విషప్రచారంచేసి, కోర్టుల్లో తప్పుడుకేసులేసి ప్రజల్లో సంస్థను చులకన చేయాలని ప్రయత్నించి భంగపడింది.
• వాటికి కొనసాగింపుగా జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కక్షసాధింపు కాదా?
• అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయంచేస్తానన్న హామీఏమైందని ఉండవల్లి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగడంలేదు?
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్
తానో విజిల్ బ్లోయర్ నంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి సంస్థపై చేసిన వ్యాఖ్యలు, ఆసంస్థ రూ.1800 కోట్లనష్టం ఎలాభర్తీచేసుకుంటుందని ఆయనప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, 2007లో నాటిప్రభుత్వం చిట్ ఫండ్ యాక్ట్ కింద ఆ సంస్థఆస్తులు సీజ్ చేసే ప్రయ త్నాలు చేసినప్పుడు, సుప్రీంకోర్టు సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఇబ్బందిపెడితే సంస్థడబ్బులు ఎలా కడుతుందని న్యాయస్థానం ప్రశ్నించిన విషయాన్ని ఉండవల్లి ఎందుకు విస్మరించారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“2007లో అప్పటిప్రభుత్వం మార్గదర్శిపై సంస్థపై, రామోజీరావుపై దుష్ప్రచారంచేసి, ప్రజల్లో వారిని చులకనచేయాలని చూశాయి. అప్పటిప్రభుత్వానికి, మార్గదర్శిసంస్థకు మధ్య కోర్టులో వాదనలుజరిగితే, న్యాయస్థానం మార్గదర్శిసంస్థ ప్రజలసొమ్ముని దుర్విని యోగం చేయలే దనే అభిప్రాయానికి వచ్చింది. తరువాత మార్గదర్శిసంస్థ రూ.2,600కోట్లను ఎస్క్రో అకౌంట్స్ లో పెట్టి, సుప్రీంకోర్టు ద్వారానే ఖాతాదారులకు అందేలాచేసింది. ఆరోజున ఏ వినియోగదారు డు కూడా తమసొమ్ము తీసుకోవడానికి ముందుకురాలేదు. కానీ మార్గదర్శిసంస్థ చెక్కుల రూపంలో ప్రతివినియోగదారుడికి అందాల్సిన సొమ్ముని సక్రమంగా అందించింది. ఖాతాదా రులకు అందించాల్సిన సొమ్ముమొత్తంపోగా, ఇప్పుడు మార్గదర్శి ఎస్క్రో అకౌంట్స్ లో కేవలం రూ.5.33కోట్లు మాత్రమేఉన్నాయి. ఎందుకు మార్గదర్శిసంస్థకు వినియోగదారుల్లో అంత గౌరవం, పరపతిఉన్నాయో కూడా, దానిపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నవారు తెలుసు కోవాలి.
మార్గదర్శిసంస్థలో ఎవరైనా చిట్ వేస్తే, చిట్ పాడుకోవాలి అనుకున్నప్పుడు వారికి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ వ్వవస్థకంటే మిన్నగా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈవిషయం డిపాజి టర్లకు, ప్రజలకు బాగాతెలుసు. తాను విజిల్ బ్లోయర్నిఅంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ కు అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కష్టాలు కనిపించడంలేదా? ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితు లకు న్యాయంచేస్తానన్న జగన్మోహన్ రెడ్డిని, అరుణ్ కుమార్ ఎందుకు ప్రశ్నించడు? 4ఏళ్ల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు న్యాయంకోసంరోడ్లపై తిరుగుతుంటే, అరుణ్ కుమార్ వారిపక్షాన ఎందుకని ఏనాడూ ఏపీప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు?
ప్రభుత్వంగానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గానీ మార్గదర్శిసంస్థ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఎందుకుసుప్రీం కోర్టు ముందు ఉంచకుండా ఉత్తుత్తి ఆరోపణలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు?
మార్గదర్శిసంస్థపై పాలకులువేసిన తప్పుడుకేసులు కోర్టుల్లో వీగిపోయాయని అరుణ్ కుమా ర్ కుతెలియదా? మార్గదర్శిపై వేసిన కేసుల్ని2018లో రాష్ట్రహైకోర్టు కొట్టేసింది నిజంకాదా? మరలా వైసీపీ అధికారంలోకివచ్చాక సుప్రీంకోర్టులో సదరుసంస్థపై కేసులువేసి, ఆర్.బీ.ఐని ఇంప్లీడ్ కావాలని కోరినా, ఇప్పటికీ ఎందుకు ఇంప్లీడ్ కాలేదు. మార్గదర్శిసంస్థలో డిపాజిట్ దారులకు ఎలాంటి అన్యాయం జరగలేదని, సదరుసంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అనేకసార్లు రుజువైంది. మార్గదర్శి డిపాజిటర్ల లిస్ట్ సుప్రీంకోర్టు అడిగిందనడం కూడా అబద్ధ మే. ఆలిస్ట్ ఎప్పుడో సుప్రీంకోర్టులో సబ్ మిట్ చేయడం జరిగింది. మార్గదర్శిసంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నందున, సదరుసంస్థ అక్కడిప్రభుత్వానికి ప్రతినెలా డిపాజి టర్ల వివరాలు అందిస్తోందనే విషయం ఉండవల్లి తెలుసుకోవాలి. మార్గదర్శిలో నిజంగా అక్రమాలుజరిగి, డిపాజిటర్లకు అన్యాయంజరిగితే ఏపీప్రభుత్వం ఆ వివరాలను, ఆధారాలను ఎందుకు సుప్రీంకోర్టు ముందు ఉంచడంలేదు? కేవలం కక్షసాధింపులు తప్ప, ఏపీప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలులేవు. మార్గదర్శిపై, సంస్థ యాజమాన్యంపై పనిగట్టుకొని దుష్ప్ర చారంచేస్తున్నారు.
మార్గదర్శి సంస్థ యజమాని రామోజీరావుకి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందనడం కూడా పచ్చిఅబద్ధం, అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకు పాల్పడిన కేసులో రూ.43 వేలకోట్లను ఈడీజప్తుచేసిన సందర్భంలో, ఉండవల్లి మాట్లాడుతూ, ఈ దేశం లో క్విడ్ ప్రోకోలు రుజువుకావని కొట్టిపారేసింది వాస్తవంకాదా? క్విడ్ ప్రోకో కేసుల్లో ఎవరికీ శిక్షలుపడవని అనలేదా? అలాంటి వ్యక్తి మరలా రామోజీరావు, టీడీపీఅధినేత మధ్యక్విడ్ ప్రోకో ఉందని ఎలాచెబుతారు? ఆధారాల్లేని ఆరోపణలు చేసి ఉండవల్లి తనపరువు తానే తీసు కుంటున్నాడు. సహాకారవ్యవస్థను రామోజీరావు చిన్నాభిన్నంచేసుంటే, దానిపై చర్యలు తీసుకోవడానికి అనేకసంస్థలు ఉన్నాయి. వాటిని ఆశ్రయించకుండా అరుణ్ కుమార్ అర్థంలే ని విమర్శలు చేయడం సరైందికాదు.
రాష్ట్రంలో ప్రజలపై ప్రభుత్వంవేస్తున్న పన్నులభారం నానాటికీ పెరుగుతోంది. ఆ పన్నులపై ఏనాడు అరుణ్ కుమార్, జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిందిలేదు. పోలవరం నిర్మాణాన్ని అట కెక్కించినా, అమరావతిని నాశనంచేసినా ఏనాడు ఉండవల్లి, ముఖ్యమంత్రిని ప్రశ్నించిందిలే దు. ఆఖరికి నిన్న సింహాద్రిఅప్పన్నస్వామి దర్శనాన్ని కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందించలేని ఈ చేతగానిప్రభుత్వతీరుని ఉండవల్లి ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారు.” అని రామ్ ప్రసాద్ నిలదీశారు.