మనకు పేదల నుండి కష్టపడి సంపాదించి కట్టే పన్నులు ఉన్నాయి కదా.
పోతే పోనీ, మన సంపన్నుల దుడ్లు పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు!
ఎవడో ఒక దొంగ వెధవ ‘మన పిల్లలకు నష్టం’ అని రాద్ధాంతం చేస్తే.. మనకు తెలిసిన కూడికలు, తీసివేతలు పక్కన పెట్టి, గుడ్లప్పగించి వెర్రివాళ్ళలా చూస్తాం. విషయం తెలిస్తే దొంగ చెప్పే దోపిడీ కథలకు మొదట సిగ్గుపడతారు, తరువాత కోపం వస్తుంది.
ఒక 150 సీట్లు ఉన్న మెడికల్ కాలేజీని ఉదాహరణగా తీసుకుందాం.
పాత ప్రభుత్వ వైద్య కళాశాలలు: ఇవి పూర్తిగా మెరిట్ మరియు రిజర్వేషన్లపై నడుస్తాయి. మొత్తం 150 సీట్లలో.. ఆల్ ఇండియా కోటా (15%) అంటే 22 సీట్లు. రాష్ట్ర కన్వీనర్ కోటా (85%) అంటే 128 సీట్లు. ఇక్కడ నామమాత్రపు ఫీజు ఉంటుంది కానీ, వీటి నిర్వహణ ఖర్చులు మొత్తం మన పన్నుల నుండే భరించాలి. అవి ఎలా నిర్వహిస్తున్నారో మీకు వేరే చెప్పక్కర్లేదు.
జగన్ హయాంలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు: నిధుల సమీకరణ కోసం సీట్లను ప్రైవేటు తరహాలో విభజించారు.
ఆల్ ఇండియా కోటా (15%) – 22 సీట్లు.
రాష్ట్ర కన్వీనర్ కోటా (కేవలం 35%) – 53 సీట్లు మాత్రమే.
సెల్ఫ్-ఫైనాన్సింగ్ (35%) – 53 సీట్లు (ఏడాదికి ₹12-13 లక్షలు).
ఎన్నారై/మేనేజ్మెంట్ కోటా (15%) – 22 సీట్లు (ఏడాదికి ₹20 లక్షలు).
ఇక్కడ 150 సీట్లలో కేవలం 53 సీట్లు మాత్రమే సామాన్యుడికి తక్కువ ఫీజుతో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 75 సీట్లు భారీ ఫీజులే. పైగా ఆ నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తే(యూనివర్సిటీల నుండి పంచాయతీ నిధుల వరకు చేదు అనుభవాలు చూశాం), అక్కడ ఫ్యాకల్టీ, సదుపాయాలు లేక విద్యార్థులు ఐదున్నరేళ్ల పాటు నరకం చూడాల్సిందే.
పీపీపీ (PPP) హైబ్రిడ్ మోడల్: ఇందులో ఆల్ ఇండియా కోటా (0%) సున్నా. రాష్ట్ర కన్వీనర్ కోటా (50%) అంటే 75 సీట్లు. జగన్ విధానం కన్నా ఇక్కడ పేదలకు అదనంగా సీట్లు దక్కుతున్నాయి. మిగిలినవి సెల్ఫ్-ఫైనాన్సింగ్, ఎన్నారై సీట్లు. వీటిని ప్రైవేటు యాజమాన్యం నిర్వహిస్తుంది కాబట్టి, వారు నాణ్యత చూపిస్తేనే సీట్లు భర్తీ అవుతాయి. కాబట్టి వారు వసతుల కోసం కష్టపడతారు, పోటీపడతారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కర్ణాటకలో డొనేషన్ కట్టి చదువుకున్న రోజుల్లో మన దగ్గర ప్రైవేటు మెడికల్ / పాలిటెక్నిక్/ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. మన ధనమంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేది. 90వ దశకం చివర్లో చంద్రబాబు తెచ్చిన మార్పులతో దానికి అడ్డుకట్టపడింది.
కరోనా తరువాత ఇప్పుడు మళ్ళీ మన ఎన్నారైలు ఎంబీబీఎస్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఆ డబ్బుతో ఇక్కడే సదుపాయాలు కల్పిస్తే మనకే లాభం కదా?
మెడికల్ టూరిజం అంటే మన దగ్గరకు రోగులను/విద్యార్థులను రప్పించడం, ఇక్కడ ఖర్చు పెట్టించడం. ఎన్నారైలతో పాటు మన డబ్బు తీసుకెళ్లి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రుల్లో ధారపోయడం కోసం దొంగ చెప్పే దోపిడీ కథలకు ఊకొడతారా? ఆరోగ్యశ్రీ పేరుతో, వైద్యం కోసం పక్క రాష్ట్రాల కార్పొరేట్ ఆసుపత్రులను పోషించడానికి మనం ఏమన్నా వారికి బాకీ ఉన్నామా?
ఎవరు ఎవరిని బతికించాలనుకుంటున్నారో ఆలోచించండి!