Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రహోం మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించరు?

-జాతీయస్థాయి నాయకుడిని రోడ్డుపై నడిపించడం ఏమిటని ఏపీ డీజీపీని అమిత్ షా ప్రశ్నించాలి కదా
-సీఎంపై డీజీపీకి అభిమానం ఉంటే రాజీనామా చేసి పాదపూజ చేసుకోండి
-పోలీసులకు రౌడీలు, గూండాలెవరో తెలియదా?
-పోలీసులపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు అయ్యన్నపాత్రుడు ఫైర్‌

మాజీ సీఎం, జాతీయ నేత చంద్రబాబునాయుడుకు సరైన భద్రత కల్పించలేని ఏపీ డీజీపీని, కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఎందుకు ప్రశ్నించరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ” రాష్ట్ర పోలీస్ శాఖ, టీడీపీ అధినేతచంద్రబాబు విషయంలో వ్యవహరించిన తీరుపై కేంద్రహోం మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించరు? జాతీయస్థాయి నాయకుడిని రోడ్డుపై నడిపించడం ఏమిటని ఏపీ డీజీపీని అమిత్ షా ప్రశ్నించాలికదా!
గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఘోరంగా వైసీపీ గూండాలు దాడిచేస్తుంటే, పోలీసులు స్పందించరా? పోలీసులకు రౌడీలు, గూండాలెవరో తెలియదా? పవిత్రమైన స్థానంలో ఉన్న డీజీపీ ఇలాంటి వాటిని ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. టీడీ పీనేతలు కొందరు గన్నవరం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి, వంశీఅవినీతి గురించి మాట్లాడితే, వారిపై, కార్యాలయంపై దాడిచేస్తారా? డీజీపీకి ముఖ్యమంత్రిపై అభిమానం ఉంటే, ఉద్యోగానికి రాజీనామాచేసి, ఆయన పాదపూజ చేసుకోవాలిగానీ, పోలీస్ వ్యవస్థనే తలదించుకునేలా చేయడం మంచిదికాదు.

ముఖ్యమంత్రిపై ఆయనకు అభిమానం ఉంటే పాదపూజ చేసుకోవాలిగానీ, ఇలాంటివి చేయ డం తప్పు. జగన్మోహన్ రెడ్డిపై డీజీపీకి అమితమైన ప్రేమాభిమానాలుంటే, ఆయన ఉద్యోగాని కి రాజీనామాచేసి, వైసీపీ కండువా కప్పుకుంటే మంచిది. అంతేగానీ తలపై మూడుసిం హాలను పెట్టుకొని గూండాలను ప్రోత్సహిస్తే, మొత్తం పోలీస్ వ్యవస్థే తలదించుకోవాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న అనపర్తిలో చంద్రబాబుగారి పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీ రు సరైందేనా? జడ్ ప్లస్ కేటగిరీ భద్రతఉన్న వ్యక్తి రోడ్డుపై నడిచివెళ్తుంటే, కరెంట్ తీసేస్తారా? ఆయన్నికారుదిగకుండా పోలీసులు కారుకి అడ్డంకూర్చుంటారా? ఇంతాచేసి, మీరేమైనా చం ద్రబాబుని ఆపగలిగారా? ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేసేవరకు నిద్రపోడు. ఆయన సంగతి మాకుబాగా తెలుసు.

పట్టాభికి ఏదైనా జరిగితే డీజీపీనే బాధ్యుడు అవుతాడు
టీడీపీనేత పట్టాభి ఏమైనా టెర్రరిస్టా? ఆయన్ని రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం పోలీసు లకు ఏమొచ్చింది? పట్టాభికి ఏదైనా జరిగితే చాలాచాలా గొడవలు అవుతాయి. పట్టాభికి ఏదైనా జరిగితే డీజీపీనే బాధ్యుడుఅవుతాడు. నిన్నగన్నవరం ఘటనలో, వైసీపీ గూండాలు పోలీసుల్ని కొట్టినా వారిపై కేసులు పెట్టలేకపోయారు. పోలీసులు అంత అసమర్థులా? పోలీసుల్ని అడ్డంపెట్టుకొని టీడీపీవారిని సాధించాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. జగన్ ఉచ్చులోపడకుండా టీడీపీకుటుంసభ్యుల సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నా. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కొత్తడ్రామాలు ఆడుతున్నాడు. అందుకే చంద్రబా బు, లోకేశ్ లకు లభిస్తున్న ప్రజాదరణచూసి, ఓర్వలేకనే పోలీసుల్ని అడ్డంపెట్టుకొని, టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడకేసులు పెడుతున్నాడు. జగన్ రెడ్డి ఉచ్చులో పడకుండా, అతని మోసాలకు గురికాకుండా టీడీపీకార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలి. సమయంవచ్చేవరకు వేచిచూసి, మనరోజు వచ్చినప్పుడు జగన్ రెడ్డికి, ఈపోలీసులకు టీడీపీ సత్తా ఏంటో చూపిద్దామని టీడీపీ కుటుంబసభ్యులకు సూచిస్తున్నా. మనపార్టీ అధికా రంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు రెచ్చిపోయే గూండాలు, వైసీపీ మూకల తోకలు కత్తిరిద్దామని సూచిస్తున్నా. పోలీసులు కూడా వారి విధినిర్వహణ వారు సక్రమంగా చేసుకోవాలని, అధికారపార్టీవారి ఆదేశాలప్రకారం నడుచుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవుపలుకుతున్నాం.”

LEAVE A RESPONSE