– కిషన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం
– సింగరేణిని దండుపాళ్యం ముఠా నుంచి కిషన్ రెడ్డి కాపాడాలి.
– ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: 2004 – 2023 వరకు సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు. బొగ్గు కుంభకోణం బయట పెట్టగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు.చట్టాన్ని గౌరవించే హరీష్ రావు ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు అయ్యారు. సాక్షిగా మాత్రమే విచారణకు రండి అని నోటీసుల్లో పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావును ఇంతసేపు విచారణ చేయడం సరికాదు..
మానసిక స్థైర్యం దెబ్బ తీసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.హరీష్ రావు వెంట లాయర్లు వెళ్ళితే వారికి అనుమతి లేదని అంటున్నారు. అక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకుల పై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు..యావత్ తెలంగాణ సమాజం హరీష్ రావు వెంట ఉంది. హరీష్ రావును అంతసేపు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.. .
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు హై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణం పై హరీష్ రావు వాస్తవాలు బయటపెట్టారు. ఎక్సెస్ గా టెండర్ వేయడం ఏంటి కొత్తగా? గత టెండర్ లో లెస్ వచ్చేది , ఇప్పుడు ఎక్సెస్ వస్తుంది. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇప్పుడు కొత్తగా తెచ్చారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి బంధువులకు బొగ్గు టెండర్ కట్టబెట్టే ప్రయత్నం.
నైనీ బ్లాక్ టెండర్ రద్దు చేస్తామని చెప్పిన బట్టి విక్రమార్క.. మిగిలిన టెండర్లు ఎందుకు రద్దు చేయరని హరీష్ రావు మాట్లాడారు.అందుకే హరీష్ రావు పైన కక్ష కట్టారు. బిజెపి మౌనంగా ఉంటుంది, కిషన్ రెడ్డి ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నారు?. కిషన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం కలుగుతుంది.
మంత్రుల వాటాల పంచాయతీలో వచ్చిన తేడాల వల్లనే ఐఏఎస్ అధికారులను కించ పరుస్తున్నారు , ఇందులో జర్నలిస్ట్ లు బలి అవుతున్నారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పలేదు..సింగరేణి ని ముంచడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది.. సింగరేణిని దండుపాళ్యం ముఠా నుంచి కిషన్ రెడ్డి కాపాడాలి.
చట్ట పరంగా పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. పరిధి దాటితే మేము అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి చూస్తాం. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలి. సింగరేణి ని లూటీ చేస్తున్న దండుపాళ్యం ముఠా పై సిట్ వేసి విచారణ చేయాలి .