– రైతులు ఎకరానికి 10వేలు రూపాయలు చొప్పున నష్టపోయారు
– రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే లోకేష్ఎందుకు స్పందించడం లేదు?
– రైతులకు పంటలకు నష్టం చెల్లించాలి
– మంగళగిరి మండల ప్రాంతంలోని వరద నీరు వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు
మంగళగిరి: చిన్న కాకాని కాజా గ్రామాలలో పొలాలు పూర్తిగా నీట మునియాయి. వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. గత రెండు రోజులుగా గుంటూరు ఛానల్ తెగిపోయి పొలాల్లోకి వరద నీరు వెళుతుంటే ఎందుకు స్పందించట్లేదు.
ఇప్పటికి రెండుసార్లు రైతులు వరి నాట్లు వేశారు. ఎకరానికి 10వేలు రూపాయలు చొప్పున నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే లోకేష్ రైతులకు ఇంత నష్టం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? గత సంవత్సరం కూడా ఇలాగే జరిగింది.
వరద రావడంతో గుంటూరు ఛానల్ కాజ సమీపంలో తెగిపోవడంతో పొలాల్లోకి పూర్తిగా వరద నీరు వచ్చింది. అప్పుడు ఇంజన్నుర్లు తూతూ మంత్రంగా కట్టను పూడ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు కట్ట తెగిపోయి పొలాల్లోకి నీరు పోవడంతో, మంగళగిరి మండలం దుగ్గిరాల మండలం రెండు మండలాల రైతులు పూర్తిగా పంట నష్టపోయారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు పంటలకు నష్టం చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, కాజా గ్రామ అధ్యక్షులు బొమ్ము శంకర్ రెడ్డి, మండల కార్యదర్శి మంద విజయబాబు, కాజ గ్రామ ఉపాధ్యక్షులు కుక్కమల్ల శేషు, కాజా గ్రామ ప్రధాన కార్యదర్శి వజ్రాల మధుసూదన రెడ్డి, మండల రైతు విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆర్ల బ్రహ్మయ్య, కుక్కమల్ల దేవరాజ్, చిన్న కాకాని గ్రామ అధ్యక్షులు కాంతారావు, కటారి రామనాగు, దేశ బోయిన కాటంరాజు, మర్రి వెంకయ్య, పల్లిగంటి ప్రసాద్, లింగినేని రామ్మోహన్రావు, రామకృష్ణారెడ్డి గుత్తికొండ, దేశ బోయిన చిన్న మరియు తదితర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.