– ప్లాన్ సి కింద జరాసంధుడు పేరును జగన్ పరిశీలించాలి
– జగన్ లో జ, రామకృష్ణారెడ్డి లో రా, ధనుంజయ రెడ్డి లో ధను కలిపి జరాసంధుడుగా పెట్టాలని జగన్ ఎందుకు అడగ లేదు?
– మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు లు వైసీపీ పాలన లో స్మగ్లింగ్ కు ఉపయోగ పడ్డాయి
– జగన్ మతి తప్పి మాట్లాడుతున్నాడు
– మీడియా సమావేశంలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ
తిరుపతి: జగన్ ఒక్కరే ఈ రాష్ట్రానికి దిక్కన్నట్లు మాట్లాడుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పనన్న జగన్ ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానిని అంగీకరించారు. అధికారం చేపట్టిన వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. చంద్రబాబుపై అక్కసుతోనే అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారు.
అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తామన్నట్లు జగన్ తీరు ఉండటం బాధాకరం. పార్లమెంటు తీర్మానం, రాష్ట్రపతి ఆమోద ముద్ర జరిగాక కూడా అమరావతి రాజధానిపై మాట్లాడడం సరికాదు. అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిపై తిరిగి తీర్మానం చేస్తాననడం రాజద్రోహం కాదా? మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు లు వైసీపీ పాలన లో స్మగ్లింగ్ కు ఉపయోగ పడ్డాయి. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి రైస్ స్మగ్లింగ్ కు ఉపయోగపడింది.
అమరావతి దేవతల రాజధాని. జగన్ మావిగన్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు జరాసంధుడు పేరు గుర్తుకు రాలేదేమో. ప్లాన్ సి కింద జరాసంధుడు పేరు ను జగన్ పరిశీలించాలి. జగన్ లో జ, రామకృష్ణారెడ్డి లో రా, ధనుంజయ రెడ్డి లో ధను కలిపి జరాసంధుడుగా పెట్టాలని జగన్ ఎందుకు అడగ లేదు?