– రాజకీయకక్షతో కొందరు వ్యక్తులే లక్ష్యంగా ఎవరి ఆదేశాలతోనో సీఐడీ పనిచేస్తోంది
– జగన్ ప్రభుత్వం వద్దఉన్న ఫోరెన్సిక్ రిపోర్ట్ అంశాలను సీఐడీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడంలేదు?
– ఎవరి ఖాతాల నుంచి ఎవరి ఖాతాలకు డబ్బులువచ్చాయో నీలిమీడియా ఎందుకు చెప్పడంలేదు?
• ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఏపీ సీఐడీ సెలక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
• రాజకీయంగా ఎవరినైతే కక్షసాధింపులకు గురిచేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుందో, వారిని మాత్రమే లక్ష్యంచేసుకుంటోంది.
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో ఏపీ సీఐడీ డిజైన్ టెక్ సంస్థను, దానిఎండీని ముద్దాయిలుగా చేర్చి, సీమెన్స్ సంస్థను వదిలేయడంలోని ఆంతర్యంఏమిటి?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
వైసీపీ, దాని అనుబంధ నీలిమీడియా స్కిల్ డెవలప్ మెంట్ పై విషప్రచారానికి తెగబడ్డాయని , 4 5 రోజుల క్రితం సీఐడీ విచారించినవారిని ఈరోజే విచారిస్తున్నట్టు చేస్తున్న నీలిప్రచారం చూస్తుంటే, సొంతబాబాయ్ హత్యతో రక్తంతడిచిన చేతుల్ని కనిపించకుండా చేయడంకోసమే ఈ కొత్తరాజకీయకుట్రకు తెరలేపినట్టు అర్థమవుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టంచేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో టీడీపీప్రభుత్వం మాదిరే, సీమెన్స్ ..డిజైన్ టెక్ సంస్థలతో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి.. ఆయా రాష్ట్రాలు కూడా అవినీతిచేశాయన్నది జగన్ ప్రభుత్వ ఉద్దేశమా?
“సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయమే నీలిమీడియాకు లీకులిస్తూ, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఉన్నవిలేనివి దుష్ప్రచారం చేస్తోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం ఉందని ఆంగ్లమీడియాలో వచ్చిన కథనాల్ని బట్టి తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రయువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంకోసం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు శ్రీకారంచుట్టారు. ఆక్రమంలో సీమెన్స్ సంస్థ, డిజై న్ టెక్ సొల్యూషన్స్ సంస్థతో టీడీపీప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. సీమెన్స్ సంస్థ తో ఏపీప్రభుత్వం ఒప్పందంచేసుకోకముందు, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రా ష్ట్రాలు కూడా ఒప్పందంచేసుకున్నాయి. ఆయారాష్ట్రాల ఒప్పందాలన్నింటిలో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఆయాప్రభుత్వాలతోకలిసి త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి.
గుజరాత్ తో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆనాడురాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ సమక్షంలో ఆ రెండుసంస్థలు 2013లో ఒప్పందం చేసుకున్నాయి. అలానే అప్పటికర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు అన్ని రాష్ట్రప్రభుత్వాలతో ఒప్పందంచేసుకున్నట్టే చంద్రబాబుప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఆయా ఒప్పందాల్లో ప్రాజెక్ట్ కు సంబంధించిన మొత్తంవ్యయంలో రాష్ట్రప్రభుత్వాల వాటా 10శాతం, ఆయాసంస్థలవాటా 90శాతం ఉండేలా నిర్ణయించారు. వైసీపీప్రభుత్వం, ఏపీసీఐడీ వాదనప్రకారం ఆయారాష్ట్రాలు కూడా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డాయనుకోవాలా?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ.3,300కోట్లు సూట్ కేసుల్లో వేసుకొని పొరుగుదేశాలకు తీసుకెళ్లినట్టు జగన్ ప్రభుత్వం, నీలిమీడియా దుష్ప్రచారంచేస్తోంది.
ఏపీప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ మొత్తం విలువను రూ.3,300కోట్లుగా నిర్ధారిస్తే, దానిలో ఆసొమ్మంతా తెలుగుదేశం నేతలు సూట్ కేసుల్లో వేసుకొని పొరుగుదేశాలకు తరలిం చినట్టు నీలిమీడియా నీతిమాలిన ప్రచారంచేస్తోంది.
రూ.3,300కోట్లకు సంబంధించి అత్యంత అధునాతన సాంకేతికపరిజ్ఞానంతో కూడిన వివిధరకాల సాఫ్ట్ వేర్లను మాత్రమే ఆయా సం స్థలు రాష్ట్రంలోని స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు అందించాలని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంచనావ్యయంపై దుష్ప్రచారం చేస్తున్న నీలిమీడియా, ఇప్పుడున్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఎలాంటి ఒప్పందాలు, కాగితాలులేకుండా నోటిమాటగా రూ.3000కోట్లు ఇవ్వమంటే ఇవ్వడం సాధ్యమవుతుం దేమో చెప్పాలి. ఆనాడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో ఏపీప్రభుత్వం ఒప్పందం చేసు కున్నసమయంలో ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని మదింపుచేసే బాధ్యతను అప్పుడు ఐపీఎస్ గాఉన్న ప్రేమచంద్రారెడ్డికి అప్పగించారు.
అదే ప్రేమచంద్రారెడ్డి కేంద్రప్రభుత్వ సంస్థ సీ.ఐ. టీ.డీతో మదింపు అంచనాలు తయారుచేయించిన మాటవాస్తవమో కాదో జగన్, అతని నీలి మీడియా సమాధానంచెప్పాలి. అదేతప్పయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రేమచంద్రారెడ్డిని ఏపీ సీఐడీఎందుకు విచారించదు? టీడీపీప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2.94లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, వారిలో 65వేల మందికి ఉద్యోగాలు కల్పించడంకూడా జరిగింది. ప్రాజెక్ట్ మొత్తం అవినీతిమయం అయితే, క్షే త్రస్థాయిలో 65వేల ఉద్యోగాలకల్పన ఎలా సాధ్యమవుతుందో నీలిమీడియా చెప్పాలి.
జగన్ ప్రభుత్వం తయారుచేసిన ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా ఏపీ సీఐడీ డిజైన్ టెక్ సంస్థను దానిఎండీని ముద్దాయిలుగా చేర్చి, సీమెన్స్ సంస్థను, దాని ఇండియా హెడ్ సుమన్ బోస్ ను ఎందుకు ముద్దాయిలుగా చేర్చలేదు?
రాష్ట్ర యువతభవిష్యత్ కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ను నిర్వీర్యంచేసిన జగన్, కావాలనే ఆ ప్రాజెక్ట్ పై బురదజల్లుతూ దుష్ప్రచారంచేస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన జగన్ ప్రభుత్వం ఎలాంటి అవినీతిని గుర్తించిందో ఎందుకు బహిర్గతం చేయడంలేదు? ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా డిజైన్ టెక్ సంస్థను, దాని ఎండీని ముద్దాయిలుగా చేర్చిన ఏపీసీఐడీ, సీమెన్స్ సంస్థను ఎందుకు ముద్దాయిగా చేర్చ లేదు? ఏపీసీఐడీ సెలక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. స్కిల్ డెవల ప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో రాజకీయంగా కొందర్నిమాత్రమే వేధింపులకు గురిచేయడమే ఏపీసీఐడీ ప్రధానలక్ష్యమని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.
జగన్ ప్రభుత్వంలో తయారైన ఫోరెన్సిక్ ఆడిట్టే నిజమైతే, డిజైన్ టెక్ సంస్థ..దానిఎండీ తప్పుచేస్తే, త్రైపాక్షిక ఒ ప్పందంలో భాగస్వామి అయిన సీమెన్స్ సంస్థను…దానిఎండీ సుమన్ బోస్ ను ఎందుకు వ దిలేసింది? 2009 నుంచి 2018 మార్చివరకు సుమన్ బోస్ సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఇండియాహెడ్ గా పనిచేశారు. అతని హయాంలోనే సీమెన్స్ సంస్థ 5రాష్ట్రాలతో ఒప్పందంచేసుకుంది.
ఆయా ఒప్పందకార్యక్రమాల్లో సుమన్ బోస్ కూడాస్వయంగా పాల్గొ న్నారు. సుమన్ బోస్ సీమెన్స్ ఇండియాసాఫ్ట్ వేర్ సంస్థ ప్రతినిధిగా ఉండబట్టే ఏపీసీఐడీ అ తని జోలికెళ్లలేదా? సీమెన్స్ సంస్థ సీఐడీ చేస్తున్నవిచారణకు సంబంధించి ఎలాంటి సమా చారం ఇవ్వకపోయినా ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదు?
ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఫోరెన్సిక్ రిపోర్ట్ లోని అంశాలనువదిలేసి, సీమెన్స్ సంస్థ తయారు చేసుకున్న ఇంటర్నల్ రిపోర్ట్ లోని అంశాలను మాత్రమే ఏపీసీఐడీ ఎందుకు పనిగట్టుకొని ప్రస్తావిస్తోంది? సీమెన్స్ సంస్థ ఇంటర్నల్ వ్యవహారాల్ని ఏపీప్రభుత్వం రాష్ట్రఅంశాలుగా ఎందుకు భావిస్తోంది ? కేవలం వ్యక్తుల్ని ఆధారంగాచేసుకునే రాజకీయప్రయోజనాలకోసమే ఇలాంటి విచారణ చేస్తున్నారని స్పష్టమవుతోంది.
దుష్ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నీలిమీడియా ఎవరిఖాతాల నుంచి ఎవరిఖాతాలకు ఎప్పుడుడబ్బులు వచ్చాయో ఎందుకు చెప్పలేకపోతోంది?
ప్రజల సొమ్ము కాపాడాలన్న తాపత్రయం జగన్ కు ఉంటే, తక్షణమే సీమెన్స్ సంస్థను స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ విచారణలో ముద్దాయిగా చేర్చాలి.
ప్రజలసొమ్ము కాపాడటంలో తనకు మాత్రమే అమితమైన ప్రేమాభిమానాలుఉన్నట్టు నటిస్తు న్న జగన్మోహన్ రెడ్డికి ఒకసవాల్ విసురుతున్నాం. ఏపీసీఐడీ విచారణలో తొలుత సీమెన్స్ సంస్థను ముద్దాయిగా చేర్చే సత్తా, ధైర్యం ఆయనకు ఉన్నాయా? ఆర్బిట్రేషన్ ద్వారా సీమెన్స్ సంస్థనుంచి డబ్బురాబట్టే అధికారం చేతిలో ఉంచుకొనికూడా జగన్ ఆ పని ఎందు కు చేయడంలేదు? ప్రజాప్రయోజనాలు కాకుండా జగన్ ఎక్కువగా రాజకీయ ప్రయోజ నాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే సీమెన్స్ సంస్థ ను ముద్దాయిగా చేర్చడంలేదు.
డిజైన్ టెక్ తో పాటు సీమెన్స్ కూడా త్రైపాక్షికఒప్పందంలో భాగస్వామి అయినప్పుడు ఒకసంస్థ తప్పుచేస్తే, మరోసంస్థ ఒప్పుఎలా చేస్తుందో జగన్ సమాధానం చెప్పాలి. ఏపీసీఐడీ పెట్టే కేసు లు ఆవిచారణ సంస్థ సొంతంగా పెడుతున్నవికావు.. కేవలం ప్రభుత్వంలోని కొందరుపెద్దలు పెడుతున్నవే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా టీడీపీప్రభుత్వం అవినీతిచేసుంటే, అధికారులు ఫిర్యాదుచేయాలి.. లేదా అప్పుడు ఆవ్యవస్థలో భాగస్వాములైన అధికారుల్ని విచారించాలి. కానీ ఏపీసీఐడీ అలాచేయడంలేదు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా అన్యా క్రాంతం అయ్యాయంటున్న డబ్బులు ఎటునుంచి ఎక్కడకిపోయి, ఎవరిద్వారా టీడీపీనేతల కు చేరాయో తక్షణమే తేల్చాలని జగన్ ను, సీఐడీని డిమాండ్ చేస్తున్నాం.
ఏపీయువతకు ఉపాధి అవసరంలేదని, వారికి గంజాయి, మాదకద్రవ్యాలుంటే చాలనే జగన్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను మూసేశాడు. తెలుగుదేశంపార్టీ, చంద్రబాబునాయుడు ఎల్లప్పుడూ రాష్ట్రప్రయోజనాలకోసమే పనిచేశారు. జగన్ అతనిప్రభుత్వం వాస్తవాలు కప్పెట్టి, విషప్రచా రంచేసినంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండాపోవు. సీమెన్స్ సంస్థలో ఉన్నవ్యక్తి తప్పుచేసి, తరువాత అతను సంస్థనుంచి బయటకు వెళ్లిపోయాడంటే వదిలేస్తారా? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగిందంటూ సీఐడీ చేస్తున్న విచారణ ఆసాంతం రాజకీ యకక్షలో భాగంగా జరుగుతున్నదే.
విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… ధూళిపాళ్ల స్పందన…
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడానికి ఏపీప్రభుత్వమే కారణం. ఈడీకి ఇచ్చిన సమాచారంలో కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వాల్సినవరకే ఇచ్చి, కావాలనే నాటకాలు ఆడుతోంది. అసలు తలలు తెగాల్సింది బాబాయ్ హత్యకేసులో. కోర్టుకి వెళ్లి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు.
మొన్నటివరకు నారాసుర రక్తచరిత్ర అన్నవారు ..ఇప్పుడు సొంతచెల్లిని దోషినిచేసి సునీత రక్తచరిత్ర అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగి, డబ్బులు టీడీపీనేతలకు వస్తే, వారెవరో ఎక్కడినుంచి వచ్చాయో 4 ఏళ్లనుంచి జగన్ ఎందుకు తేల్చలేకపోయాడు” అని ధూళిపాళ్ల నిలదీశారు.