-జల వనరుల శాఖ అధికారులలో ఎందుకు ఈ గందరగోళం?
– సలహా ఇచ్చిన ఆ అధికారులు ఎవరో చెప్పండి
– మంత్రి నిమ్మలకు ఆలోచనపరుల వేదిక ప్రశ్నల వర్షం
– సలహా ఇచ్చిన ఆ అధికారులు ఎవరో చెప్పండి
– మంత్రి నిమ్మలకు ఆలోచనపరుల వేదిక ప్రశ్నల వర్షం
పోలవరం బనకచర్ల ప్రాజెక్టు టెండర్లను ఎందుకు రద్దు చేశారో ప్రజలకు నిజాయితీగా సమాధానం చెప్పాలని ఆలోచన పరులు వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసలు ఏ నిపుణులు.. ఏ ఇంజనీరింగ్ అధికారులు.. మీరు ప్రస్తావించిన నల్లమల సాగర్ నుండి శ్రీశైలం జలాశయానికి లేదా బనకచర్లకు తరలించే సూచనలు చేశారో వెల్లడించండి.
రాష్ట్ర ప్రజల హక్కులను ఈ ప్రాజెక్టు ప్రమాదంలోకి వెళుతుందన్న ప్రజల వ్యతిరేకతను చూసిన తర్వాత కూడా జలవనురుల శాఖ అధికారులు ఇంత గందరగోళం ఉండటం ఆశ్చర్యమని ఆలోచన పరుల వేదిక విరుచుకుపడింది.
ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవాని ప్రసాద్, టి లక్ష్మీనారాయణ, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆలోచనపరుల వేదిక ప్రకటన పూర్తి పాఠం ఇది..
ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవాని ప్రసాద్, టి లక్ష్మీనారాయణ, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆలోచనపరుల వేదిక ప్రకటన పూర్తి పాఠం ఇది..
పోలవరం – బనకచెర్ల పథకం డిపియర్ తయారు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ ను ఎందుకు రద్దు చేశారని ఒక పాత్రికేయుడు మిమ్ములను అడిగితే మీరిచ్చిన సమాధానం అత్యంత గర్హనీయం. మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. టెండర్ రద్దును ఎందుకు చేశారో నిజాయితీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన, ఆ శాఖ మంత్రిగా మీపైన ఉన్నది. డొంకతిరుగుడు సమాధానంతో పాటు మరింత గందరగోళాన్ని సృష్టించడానికి దోహదపడేలా మీ సమాధానం, వివరణ ఉన్నది.
పోలవరం నుండి నల్లమలసాగర్ రిజర్వాయరు వరకు రెండు దశల్లో నిర్మాణం చేపట్టి, అక్కడ నుండి శ్రీశైలం రిజర్వాయరుకు ఎత్తిపోయాలా లేదా రివర్స్ పంపింగ్ ద్వారా బనకచెర్లకు తీసుకెళ్ళాలా లేదా సోమశిల రిజర్వాయరుకు తీసుకెళ్ళాలా, అన్న అంశంపై తర్వాత నిర్ణయం తీసుకొంటామంటూ వ్యాఖ్యానించడం అనుసంధాన పథకంపై అవగాహనారాహిత్యంతో చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నాం. నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడిన మీదటే టెండర్ ను రద్దు చేశామని చెప్పారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, ఏ నిపుణులు, ఇంజనీరింగ్ అధికారులు మీరు ప్రస్తావించిన “నల్లమలసాగర్ నుండి శ్రీశైలం జలాశయంకు లేదా బనకచెర్ల’కు తరలించే సూచనలు చేశారో వెల్లడించండి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల భారీ ఎత్తిపోతల పథకం లోపభూయిష్టమైనదని, కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత చవిచూచిన తర్వాత కూడా ప్రభుత్వం మరియు జలవనరుల శాఖాధికారుల్లో ఇంత గందరగోళం ఉన్నదా!
కృష్ణా నదీ జలాలను, శ్రీశైలం జాలాశయం నుండి సహజ ప్రవాహం ద్వారా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదుగా, నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ మరియు గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులకు సరఫరా చేయాలి. వాటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలని, కృష్ణా నీటిని సర్దుబాటు చేయాలని, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోనే పేర్కొని, ఆ ప్రాజెక్టులకు చట్టబద్దత కల్పించబడింది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేడు విచారణ కూడా చేస్తున్నది. ఈ నేపథ్యంలో మీ వ్యాఖ్యలు ఎంత హానికరమో ఒకసారి ఆలోచించుకోండి.
ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి, మీకు వ్రాతపూర్వకంగా పంపిన విజ్ఞాపన పత్రాలను ఒకసారి చదవమని విజ్ఞప్తి. రాష్ట్ర జలవరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగారికి ఎనిమిది పేజీలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేసి, అంశాల వారిగా వివరించాము. మేం పట్టిన కుందేటికి మూడేకాళ్ళన్న సామెతగా ప్రభుత్వం పోలవరం బనకచెర్ల భారీ ఎత్తిపోతల పథకంపై డిపియర్ కోసం టెండర్ పిలిచింది, రద్దు చేసుకున్నది. ఎందుకు రద్దు చేసిందో, పారదర్శకంగా, జవాబుదారీతనంతో, చిత్తశుద్ధితో, వాస్తవాలను ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
జాతీయ నదుల అనుసంధానంలో అంతర్భాగంగా గోదావరి కృష్ణా-పెన్నా నదుల (పోలవరం బొల్లాపల్లి సోమశిల) అనుసంధాన పథకాన్ని, చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు మరియు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు నీరందించే విధంగా, వైకుంఠాపురం సమీపంలో కృష్ణా నదిని దాటించేలా చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఏబి వెంకటేశ్వరరావు
కంభంపాటి పాపారావు
అక్కినేని భవానీ ప్రసాద్
విశ్రాంత ఐపిఎస్ ఉన్నతాధికారి
విశ్రాంత ఇంజనీర్
రైతు సేవా సమితి, అధ్యక్షులు
టి. లక్ష్మీనారాయణ
నలమోతు చక్రవర్తి
జొన్నలగడ్డ రామారావు
జలవనరులు & ప్రాజెక్టుల విశ్లేషకులు
సెంటర్ ఫర్ లిబర్టీ, అధ్యక్షులు
వ్యవసాయ రంగం, ఆర్థిక వేత్త
కంభంపాటి పాపారావు
అక్కినేని భవానీ ప్రసాద్
విశ్రాంత ఐపిఎస్ ఉన్నతాధికారి
విశ్రాంత ఇంజనీర్
రైతు సేవా సమితి, అధ్యక్షులు
టి. లక్ష్మీనారాయణ
నలమోతు చక్రవర్తి
జొన్నలగడ్డ రామారావు
జలవనరులు & ప్రాజెక్టుల విశ్లేషకులు
సెంటర్ ఫర్ లిబర్టీ, అధ్యక్షులు
వ్యవసాయ రంగం, ఆర్థిక వేత్త