– క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని కేసీఆర్ పీఏసీ చైర్మన్లుగా చేశారు
– కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కె.సి.వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారు
– కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలి
– పీఏసీ సభ్యులు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్ గా కేసీఆర్ నియమించారు. క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశాము. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కె.సి.వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారు.
హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగాము. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలి. అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు.
పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు.
సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలి. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్ గా నియమించాలి.
కాంగ్రెస్ బుల్డోజ్ పాలిటిక్స్: ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బుల్డోజ్ పాలిటిక్స్ చేస్తోంది. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా అక్రమంగా నియమించారు. పీఏసీ చైర్మన్ గా ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్ కు ఉంది. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పే అధికారం కాంగ్రెస్ నేతలకు లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా చర్యలు తీసుకోలేదు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారు. అరికెపూడి గాంధీ,పట్నం మహేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలు :ఎమ్మెల్సీ ఎల్.రమణ
ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్ పదవి కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన ఖర్చులపై పీఏసీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని మీకు అనుకూలంగా ఉన్న అరికెపూడి గాంధీకి ఎట్లా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారు?