Suryaa.co.in

Andhra Pradesh

ఆటవిక, అరాచక, కర్కశ పాలన నడుస్తోంది

– టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రంలో ఆటవిక, అరాచక, కర్కశ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ ధోరణితో పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాలను బెదిరింపులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ? ఆయన నక్సలిస్టా లేక టెర్రరిస్టా? ప్రజా ఉద్యమాల్ని, ప్రతిపక్షాలని అణచివేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం పై జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారు. తన వైఖరి మార్చుకోకపోతే ముందు రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగుల్ని పోలీసుల చేత జుట్టు పట్టి ఈడ్చారు. ఉద్యోగుల నెత్తిన శఠగోపం పెట్టారు. వైసీపీ పాలన లో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ లా రాష్ట్ర పరిస్థితి తయారైంది. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులు, భూములు తాకట్టు పెడుతున్నారు.

LEAVE A RESPONSE