– అణిచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడతారా?
– టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావు పై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం.
– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ : రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై పోలీసులు ఉల్టా కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం. గడిచిన 2 నెలలుగా రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం..ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్న మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం శోచనీయం. శాంతిభద్రతల నిర్వహణను పక్కన పెట్టి ప్రజల గొంతునొక్కేందుకు పోలీసులను వాడడం అప్రజాస్వామికం. జర్నలిస్ట్ సాంబశివరావు పై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేస్తున్నాం.