-టీడీపీ ఎమ్మెల్సీ, బీటీ నాయుడు
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అయిన గుడివాడకు చంద్రబాబు ఏమీ చేయలేదు. గుడివాడలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 8,912 టిడ్కో ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు సీయం జగన్ రెడ్డి గుడివాడ సభలో చెప్పడం ప్రపంచమంత అబద్దం.
నిజంగా గుడివాడలోనే కాదు రాష్ట్రంలో కట్టించిన టిడ్కో ఇళ్ళను అన్నిటిని నేనే కట్టించానని తాను కొలిచే పవిత్ర గ్రంధం బైబిల్ ప్రమాణం చేసి జగన్ రెడ్డి చెప్పగలరా? నిజంగానే తెలియని వారు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే టిడ్కో ఇళ్లు కట్టించిందని నమ్మవచ్చు. అబద్దాలతో జనాన్ని బురిడి కోట్టించడంలో జగన్ నైపుణ్యం అనితర సాధ్యం. కూల్చడం,విడగొట్టడం,చెడగొట్టడం,విద్వంసం చెయ్యడం,అబద్దాలు,అహంకారం,అరాచకం,అవినీతి జగన్ రెడ్డి ఆభరణాలు.
గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను 80శాతం నుంచి 90 శాతం వరకు పూర్తి చేసింది. కానీ జగన్ రెడ్డి టిడ్కో ఇళ్లను నేనే నిర్మించానని జగన్ చెప్పుకొవడం చూస్తే ఎవడికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకొన్నచందంగా వుంది.
రాష్ట్రంలో పట్టణ పేదలకు పక్కా భవనాలను నిర్మించి ఇవ్వాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతోపాటు వీటిని చేపట్టింది. అప్పటి మునిసిపల్ మంత్రి టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పట్టణాల శివార్లలో షీర్ వాల్ టెక్నాలజీతో అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది. వాటిని టౌన్ షిప్ లా మార్చేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేసింది.
శాచ్యురేషన్ పద్దతిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేసింది. వీటిని మూడు కేటగిరీల్లో నిర్మించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటికి రూ.500 డిపాజిట్ చెల్లిస్తే చాలు.ఇక కొంత సొంత డబ్బు ఖర్చు పెట్టుకోగలిగే శక్తి ఉన్న వారు రూ.50వేలు భరిస్తే 365 చదరపు అడుగుల ఇంటిని,రూ.లక్ష కడితే 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని ఇవ్వాలని నిర్ణయించారు.
గత ప్రభుత్వం 1.43 లక్షల 300 చ.అడుగుల ఇళ్లు పూర్తి చేసింది. 365 చ.అ. ఇళ్లు 44వేలు, 430 చ.అ. విస్తీర్ణమున్న ఇళ్లు 74వేలు నిర్మించింది. మొత్తం 2,.62,216 లక్షల ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వం హయాంలోనే వందశాతం పూర్తయ్యాయి. మరో 8 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో 80 శాతం 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసింది ఏమిటంటే రివర్స్ టెండరింగ్ పేరుతో టిడ్కో ఇళ్ల పనులు నిలిపివేసి, అందంగా తన పార్టీ రంగులు వేశారు. 80నుంచి 90 శాతం పనులు జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పంపిణీ చేస్తే గత ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందన్న దుర్భుద్దితో టిడ్కో ఇళ్ల ప్రాజెక్టును రివర్స్ చేశారు. షీర్వాల్ టెక్నాలజీతో నాణ్యమైన పనులు చేయబట్టి ఇళ్లు గట్టిగా అలాగే ఉన్నాయి. లేకపోతే.ఈ నాలుగేళ్లలో అవి ఎప్పుడో శిథిలమయ్యేవి.టిడ్కో ఇళ్ల సముదాయాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తి చేయలేదు.
గుడివాడలో నిర్మించిన 8 వేల టిడ్కో ఇళ్లలో 6 వేల ఇళ్లకు కనీసం వాటర్ సప్లయి కూడా లేదు.అయినా సరే. నాలుగు ఇళ్ళు పంచిపెట్టి,ఆ పేరుతో ఒక సభ పెట్టి, వంద అబద్దాలు చెప్పి, చంద్రబాబు ను బూతులు తిట్టి కొందరినైనా నమ్మించి అధికారం లోకి రావాలని ఆరాట పడ్డాడు జగన్ రెడ్డి.టిడ్కో ఇళ్ల పై అబద్దాలు చెప్పి వెళ్ళి పోవడం కాదు. దైర్యం వుంటే నిజంగా గుడివాడలోనే కాదు రాష్ట్రంలో కట్టించిన టిడ్కో ఇళ్ళను నేనే కట్టించానని తాను కొలిచే పవిత్ర గ్రంధం బైబిల్ ప్రమాణం చేయగలరా ?