– తిరుమల అంటే వైసీపీకి ఎందుకంత లోకువ?
– ఈ ప్రచారం మసీదు, చర్చిలపై చేసే దమ్ముందా?
– తిరుమలలో గ్రహణం రోజున మీడియా ప్రతినిధుల ఫొటోలపై వైసీపీ సోషల్మీడియాలో రచ్చ
– టివి5 ప్రతినిధి తాళం వేస్తున్నారంటూ యాగీ
– అందులో సాక్షి ప్రతినిధి కూడా ఉన్న విషయం మర్చిపోయిన వైసీపీ మీడియా
– దానితో అడ్డం తిరిగిన వైసీపీ కథ
(నిజం)
ఎవరికయినా అనుభవమయితే తత్వం బోధపడుతుంది. చేతులు కాలిన తర్వాతయినా చేతలు జాగ్రత్తగా ఉంటాయి. కానీ వైసీపీ యవ్వారం ఇందుకు పూర్తి రివర్సు. గద్దె కూలి, 11 స్థానాలకు చేరినా వైసీపీ సోషల్మీడియాది ఇంకా అదే పాత మూస. అదే పాతచింతకాయ కథలు, కాకరకాయలూ. మొన్న గ్రహ ణం రోజున తిరుమలలో ఆలయ గేటుకు ద్వారం వేశారు.
దానిని అక్కడున్న టీవీ5 రిపోర్టర్ తాళం చెవితో తీస్తున్నట్లు ఒక వీడియోను వైసీపీ ప్రపంచం మీదకు వదిలింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ రిపోర్టరు పక్కనే సాక్షి రిపోర్టరు కూడా జగన్ మాదిరిగానే ‘షిక్కటి షిరునవ్వులు’ చిందిస్తూ ఫొటోలు దిగారు. దానితో వైసీపీ కథ తస్సాదియ్యా తుస్సుమంది.
మరి తిరుమలపై ఇన్నేసి దుష్ర్పచారాలు వండివారుస్తున్న వైసీపీ, దాని అనుబంధ మీడియా.. అలాంటి కథనాలు, ఆరోపణలనే మసీదు, చర్చిలపైనా చేసే దమ్ముందా? అంటే తిరుమల అంటే వైసీపీ-సాక్షికి అంత లోకువా? అన్నది హిందూ సమాజం సంధిస్తున్న ప్రశ్న.
* * *
ఇతను శ్యామ్ టీవీ5లో పనిచేస్తున్నారు ప్రస్తుతం. ఇంకొకతను ప్రసాద్, సాక్షిలో పని చేస్తున్నారు. ఇద్దరూ వృత్తిలో భాగంగా నవ్వుతూ మహాద్వారం ముందు గ్రూపు ఫోటో కూడా దిగారు.
గ్రహణం ముందు తిరుమల ఆలయాన్ని మూసివేస్తూ ఆలయ సిబ్బంది తాళాలు వేశారు. దానిని కవర్ చెయ్యడానికి వెళ్లారు వీరు అందరూ.
మహాద్వారం ముందు అత్యవసర సమయాల్లో తీసుకోవడానికి ఒక చిన్న గేటు పెట్టి దానికి తాళం వేస్తారు. దానికి ముందు సెక్యూరిటీ పోస్టు వుంటుంది.
తమ తమ మీడియాల కోసం ఆలయ ద్వారాలకు తాళం వేసే దృశ్యాలను తీసుకొన్నారు. తరువాత ఈ చంద్రగ్రహణంకు గుర్తుగా.. ఈ గేటు వద్ద తమ ద్విచక్రవాహనాల తాళంచెవి పెట్టి, ఒక్కొక్కరూ ఫోజులు ఇస్తూ.. వ్యక్తిగతంగా ఫోటోలు తీసుకున్నారు.
మనుషులు ఎవరైనా ఇదే అర్థం అవుతుంది. వైకాపా సోషల్మీడియా సోదరులకు కూడా అదే కనిపించి వుంటుంది. అలాగే అర్థం అయ్యి వుంటుంది. కానీ వైకాపా అధినేత నుండి తిరుపతిలో నాయకుడి వరకు తిరుమల అంటే లెక్కలేదు. స్వామి అంటే గౌరవం భక్తి ఏమీ వుండదు. టీవీ5 వార్తలు చూసి, దాని అధినేత మీద, ఆయన టిటిడి చైర్మన్ అయ్యారని తిరుమల వెంకటేశ్వర స్వామి మీదే పగబట్టారు.
మహాద్వారం తాళాలు టీవీ5 జర్నలిస్టుకు ఇచ్చేశారని తప్పుడు ఫేక్ కథనాన్ని వైకాపా పేజీలో పెట్టి సోషల్మీడియాలో తిప్పుతున్నారు. పుట్టలో తపస్సు చేస్తూ మన కోసం వెలసిన తిరువెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే.. ఈ ఉన్మాద వైకాపాకు పుట్టగతులు వుంటాయా? ఆ పార్టీని అభిమానిస్తూ.. వెనకేసుకొని వచ్చే వారి కుటుంబాలకు ఈ తప్పుడు అప్రాచ్యపు ఉన్మాద రోత అంటి నాశనం అవ్వవా?
కేసులు పెట్టి, బొక్కలో వేస్తే తప్పా? వేరే మతాల విషయంలో ఇలాంటి తప్పుడు కథనాలకు వైకాపా ధైర్యం చేస్తుందా? హిందూ మతం యొక్క సహనాన్ని ఈ వైకాపా పదే పదే పరిహాసం చేస్తూ పరీక్షిస్తోంది.
