– రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల వచ్చిన “హుదూధ్” “తిత్లీ” తుఫానుల కారణంగా అటు రైతాంగం ఇటు అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా కోలుకోక ముందే “మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు” “మాండోస్” తుఫాన్ జనజీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుంది! రాష్ట్ర వ్యాప్తంగా తుఫానులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రంగానికి గుర్తొచ్చే మొట్టమొదటి డిపార్ట్మెంట్ “విద్యుత్ డిపార్ట్మెంట్” విద్యుత్ శాఖలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే!
విద్యుత్ శాఖలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగస్తులకు,ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు తుఫాను కారణంగా “సెలవులు లేవు” అని ఏసీ గదులలో కూర్చొని ఆదేశాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు,విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కార్మికుల ఉద్యోగ భద్రతపై కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చే విధంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చొరవ చూపాలి! రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకూడదని ప్రభుత్వ,విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ సెలవులు పెట్టకుండా సబ్ స్టేషన్ల వద్ద, కాల్ సెంటర్స్ లలో రాత్రింబగళ్లు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న విద్యుత్ ఉద్యోగస్తులు,ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులకు ప్రజలందరి తరఫున “హాట్సాఫ్” చెబుతున్నాను!
రాష్ట్రవ్యాప్తంగా చాలీచాలని జీతాలతో అనేక సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 23 వేల మందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచుతానని పాదయాత్ర సందర్భంగా ఏపీ సీఎం ఇచ్చిన మాటను మానవతా దృక్పథంతో నిలబెట్టుకోవాలి! రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలోని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి “వాడుకోవాలే” తప్ప వాళ్ల జీవితాలతో “ఆడుకోకూడదు”..
తుఫాను సందర్భంగా భారీ వర్షాలతో గ్రామాలలో పట్టణాలలో చెట్టుకొమ్మలు విరిగి రోడ్డుపై పడే కరెంట్ తీగల కారణంగా పాదచారులకు ప్రాణ నష్టం జరగకూడదని ఎప్పటికప్పుడు కరెంటు పోల్స్, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ టవర్ లు ఎక్కి హై టెన్షన్ లైన్ల మరమ్మత్తులలో విద్యుత్ లైన్ మాన్ లకు,ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సబ్ స్టేషన్ లలో, కాల్ సెంటర్స్ లలో RAIN కోట్స్,హ్యాండ్ గ్లౌజ్స్,గమ్ భూట్స్,ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటి సేఫ్టీ పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులదే!