Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం

-విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీసిన జగన్
-ఉప్పు రైతులు పోలాల వద్దే నిల్వ చేసుకునే విధంగా షెడ్లు నిర్మాణం చేస్తాం
-అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం
-ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం
-టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

జగన్ పరిపాలన వచ్చిన తరువాత ఉప్పు సాగు చేస్తున్న రైతులకి కనీస సాయం అందడం లేదు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను జగన్ ప్రభుత్వం దోచుకుంటుంది.పండించిన ప్రతి పంటకు క్రాప్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఉప్పు కి మాత్రం ఇన్స్యూరెన్స్ లేదు. వర్షాలు, వరదలు వచ్చనప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.అలాగే ఉప్పు నిలవ చేసుకోవడానికి షెడ్లు ఏర్పాటు చేయాలి.పండించిన ఉప్పు తీసుకువెళ్ళడానికి రోడ్లు లేవు.ఎన్నో ఏళ్లుగా ఉప్పు సాగు చేసుకుంటున్నాం. మాకు పట్టాలు ఇప్పించాలి. -టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తో కావలి నియోజకవర్గం ఉప్పు సాగు రైతులు

లోకేష్ మాట్లాడుతూ..
150 వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది.ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు. నేను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉప్పు సాగు చేసే పొలాలకు రోడ్లు కూడా వేసాం. జగన్ పాలనలో ఉప్పు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ఉప్పు రైతులను కోలుకోలేని దెబ్బతీసిన జగన్.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన ధరకే విద్యుత్ అందిస్తాం. జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులు పోలాల వద్దే నిల్వ చేసుకునే విధంగా షెడ్లు నిర్మాణం చేస్తాం.వరదలు, వర్షాలు వచ్చి ఉప్పు రైతులు నష్టపోయినప్పుడు ఇన్స్యూరెన్స్ కల్పించే అంశం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం. ఇతర రైతులకు ఇచ్చిన్నట్టే సబ్సిడీలు అందిస్తాం. ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు అందిస్తాం. ఉప్పు సాగు రైతులకు పట్టాలు ఇచ్చే అంశం పై పార్టీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూమి కూడా ఉందని చెబుతున్నారు. దీని పై పూర్తి వివరాలు తీసుకొని స్పందిస్తాను. – నారా లోకేష్ ను కలిసిన పాతపాలెం గ్రామస్తులు

కావలి నియోజకవర్గం పాతపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు
మా గ్రామం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో అలలు మా గ్రామం మీదకు వస్తున్నాయి. ప్రమాదపుటంచున మేం బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాం. గతంలో ఎన్నోసార్లు అలల ధాటికి మా నివాసాలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. మాకు సురక్షిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించాలి. మా గ్రామంలో విద్యుత్ స్థంభాలు పూర్తిగా పాడైపోయాయి. వైర్లు తెగి రోడ్లు మీద పడుతున్నాయి, కొత్త విద్యుత్ లైన్లు వేసి మా ప్రాణాలు కాపాడాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
వైసిపి నాయకులకు తీరప్రాంత ప్రజల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు.సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చాక వెంటనే పాతపాలెం గ్రామస్తులకు సురక్షిత ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఎర్రప్పగుంట గ్రామస్తులు
కావలి అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రప్పగుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో కి.మీ. వరకు రోడ్డు సరిగా లేదు, సిసి రోడ్డు నిర్మించాలి.తాగునీరు వారానికి ఒకరోజు వస్తున్నాయి, నిత్యం పనులకు వెళ్లే మేము నీటికి ఇబ్బంది పడుతున్నాం.కాలనీలో ఇళ్లస్థలాలు ఇవ్వకపోగా, సొంతస్థలాలు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేయడం లేదు.మీరు అదికారంలోకి వచ్చాక మా గ్రామసమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. పంచాయితీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.8,660 కోట్ల నిధులను దారిమళ్లించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వస్థానంలో ఉంది.సెంటుపట్టాల పేరుతో అడ్డగోలు దోపిడీ తప్ప, పేదవాడికి ఇళ్లు నిర్మించడంలో ఈ ప్రభుత్వానికి శ్రద్ధలేదు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.

LEAVE A RESPONSE