Suryaa.co.in

Andhra Pradesh

రైతన్నలకు అండగా నిలుస్తా

-రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన బాబుకి కృతజ్ఞతలు
– వ్యయసాయాభివృద్దికి పాటుపడతా

– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్నతలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్దికి పాటుపడతా. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను భ్రష్టుపట్టించింది. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్దికి పాటుపడతాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు అన్ని విధాల అండగా నిలబడతాం.

రైతుల ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సబ్సిడీ యంత్రాలు, యంత్ర పరికరాలు, మైక్రో ఇరిగేషన్ వంటి అన్ని పధకాలు పునరుద్దరిస్తాం. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నావంతు కృషి చేస్తా.

LEAVE A RESPONSE