– తెలుగుదేశం నాయకులు కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి రైతుల తొలి పాదయాత్ర గురించి పుస్తకం రాయటం అభినందనీయమని మాజీ మంత్రి తెలుగుదేశం నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు & ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యులు పోపూరి శివరామ కృష్ణ కన్నాని మర్యాద పూర్వకం గా కలసి శాలువా తో సత్కరించారు .తొలి పాదయాత్ర గురించి తాను రచించిన అడుగడుగు ఆశయసాధనకె పుస్తకాన్ని ఆయనకు అందచేశారు .అమరావతి ఉద్యమానికి తాను మరింతగా అండదండలు అందిస్తా నని కన్నా తెలిపారు .కార్యక్రమం లో నాదెండ్ల సుందరబాబు పాల్గొన్నారు