– ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
– దేవుడి ఎదుట ప్రమాణం చేసిన సీఎల్పీ నేత భట్టి
-శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం
-వంద రూపాయల బాండ్ పేపర్ పై ముద్రించిన అఫిడవిట్ పై దైవ సన్నిధిలో సంతకం
కార్తీక పౌర్ణమి రోజున బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన అఫీడవిట్ పైన సంతకం చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
“ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతాను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను.
నిజాయితీగా నా బాధ్యతలు నిర్వహిస్తాను. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్తీక పౌర్ణమి రోజున మధిర నియోజకవర్గం, బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేశారు.
ప్రమాణం చేసిన అంశాలను వంద రూపాయల బాండ్ పేపర్ పై ముద్రించిన అఫిడవిట్ పై దైవ సన్నిధిలో సంతకం చేశారు. మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని అఫిడవిట్ తో హామీ ఇచ్చారు.