– వైకాపా పోకడలకు ఆ ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?
పోనీ ఆ అసభ్య పద దూషణలు ఏమన్నా ప్రజా సమస్యల పైనా?
అంటే కాదు.
కలియుగ దైవం పట్ల అపచారం చేస్తూ చేసిన కల్తీ మీద సిట్ ఛార్జ్ షీట్ ను వక్రీకరిస్తూ.. అందులో కల్తీ జరగలేదని బొంకుతూ.. కోట్లాది హిందువులకు చేసిన కల్తీ మీద క్షమాపణలు చెప్పకుండా.. మరోసారి దైవం అంటే ఖాతరు చేయకుండా.. అదే అపచారాన్ని కొనసాగిస్తూ.. మరింత దురహంకారంతో చంద్రబాబును బూతులు తిడుతూ.. ఆయన్ను క్షమాపణలు అడగడంను ఏమనుకోవాలి?
కలి ఆవహించిన పోగాల వైకాపా పోకడలకు ఆ ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?
ఏ వ్యవస్థల నుండి? ఆ వ్యవస్థల ద్వారా ఆ అపచారాలను మరోసారి జరగకుండా ఆపలేని అసమర్థతో.. కూకటి వేళ్లతో వెలికితీసి గట్టిగా శిక్షించలేని దౌర్భాగ్య స్థితిలో.. ఏడుకొండల స్వామి కోట్లాది భక్తులకు లేని వీఐపీ, ప్రోటోకాల్ దర్శన భాగ్యం అనుభవించి వరాలు కోరే వారికి ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది అనుకుంటున్నారా?
అధర్మ కొమ్ముకాసే పాప కర్మ వారిని వదులుతుందా?
వీఐపీ, ప్రోటోకాల్ దర్శన సౌభాగ్యాలను పొందే వారు ఆ అపచార, అప్రాచ్యాల మీద స్పందించక పోవడాన్ని ఏమనుకోవాలి?
కానీ గుర్తుంచుకోండి వడ్డీకాసుల వాడు వడ్డీతో కుటుంబాలు కూడా అనుభవించేలా వడ్డిస్తాడు. అనుభవిస్తారు జాగ్రత్త.
ఓం నమో వేంకటేశాయ.