– మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
హైదరాబాద్: గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవలంబించిన విధానాలనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ప్రజా ఉద్యమాలకు సంబంధించి.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, నాయకులను గృహ నిర్బంధంలో పెట్టడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో హిందూ సంఘాలు నిర్వహిస్తున్న కుంకుమార్చన కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం దారుణం.
ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తమ బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం, వారి పక్షాన నిలబడటం నాయకుల ముఖ్య బాధ్యత. అయితే, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం దారుణం. బీఆర్ఎస్, కాంగ్రెస్… రెండు పార్టీలు ఒకే విధంగా ప్రజలపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని స్పష్టమైంది. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం వ్యవహరించడం సిగ్గుచేటు. ఎన్నికల కమిషన్‌పై దాడులు, అభాండాలు వేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం అనైతికం. ఇది మన రాజ్యాంగానికి, దేశ గౌరవానికి ముప్పు.
‘ఓటు చోరీ’ అని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీకి…, కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈ ఆరోపణలు ఎందుకు వినిపించవు?
అంతర్జాతీయ స్థాయిలో కొన్ని శక్తులు భారత రాజకీయాలను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నట్లు స్పష్టమైన సూచనలు ఉన్నాయన్నారు.